టీడీపీతోనే దళితులకు మేలు

Published: Mon, 08 Aug 2022 23:02:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీడీపీతోనే దళితులకు మేలుసభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున

సీఎస్‌పురం, ఆగస్టు 8 :  తెలుగుదేశం పార్టీతోనే దళితులకు మేలు చేకూరుతుందని  టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లికార్జున అన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లను ఎత్తివేసి తీవ్ర అన్యాయం చేసారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారన్నారు. కార్యక్రమంలో ఐ టీడీపీ కోఆర్డినేటర్‌ మాదినేని శ్రీనువాసులు, నాయకులు జి.పెద్ద నర సింహులు, కదిరయ్య, కె.వెంకటసుబ్బయ్య, ఎన్‌.నరసింహులు, చిన్న వెంకటయ్య పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.