150 ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంట

ABN , First Publish Date - 2021-04-24T04:20:49+05:30 IST

మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వడగడ్లవాన బీభత్సం సృష్టించింది.

150 ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంట

అట్లూరు, ఏప్రిల్‌ 23: మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వడగడ్లవాన బీభత్సం సృష్టించింది. కామసముద్రంలో వడ గండ్ల తాకిడికి 150 ఎకరాల్లో చేతికి వచ్చిన వరిపంట గింజలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో సుమారు రూ.9 లక్షల పంట నష్టం వాటిల్లింది. శక్రవారం మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణారెడ్డి, మాడుపూరు సచివాలయం అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సందీప్‌ కామస ముద్రంలో దెబ్బతిన్న వరిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వడగడ్లవానకు దాదాపు 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతిందన్నారు. రైతుల నష్టం ప్రాధమిక నివేది కను  జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు పంపించామన్నారు.

Updated Date - 2021-04-24T04:20:49+05:30 IST