డేంజర్‌ బెల్స్‌!

ABN , First Publish Date - 2021-03-01T06:13:50+05:30 IST

కరోనా మళ్లీ కలవరపెడుతోంది. ఖతమైపోతోందనుకున్న సమయంలో ‘సెకండ్‌ వేవ్‌’ రూపంలో భయాందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పొరుగున ఉన్న మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులో ఉన్న భూపాలపల్లి జిల్లాకు ప్రమాదం పొంచి ఉంది. అయినా అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేదు. ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించడం లేదు.

డేంజర్‌ బెల్స్‌!
అంత‌ర్రాష్ట్ర వంతెన‌పై రాక‌పోక‌లు

మహారాష్ట్రలో భారీగా పాజిటివ్‌ కేసులు

కాళేశ్వరం, మేడిగడ్డ మీదుగా ప్రయాణాలు

నిత్యం కూలీలు, భక్తులు, పర్యాటకుల రాకపోకలు

సరిహద్దు వద్ద కనిపించని కరోనా టెస్టులు

పొరుగున ప్రమాదం ఉన్నా పట్టించుకోని జిల్లా  యంత్రాంగం


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

భూపాలపల్లి జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు ఆరు నుంచి పది వేల వర కు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ కొన్ని జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులో ఉన్న భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో చాటాచోట్ల సరిహద్దుల వద్ద కరోనా పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించి నెగెటివ్‌ రిపోర్టు వస్తేనే తెలంగాణలోకి అనుమ తి ఇస్తున్నారు. అయితే... భూ పాలపల్లిలో మాత్రం సరిహద్దు ల వద్ద కరోనా టెస్టులు నిర్వహించాలనే ఆలోచనే వైద్య శాఖ అధికారులకు రాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూపాప ల్లి జిల్లాలో కరోనా డి సెంబరు, జనవరి నెలల్లో తగ్గుముఖం పట్టినట్టు కనిపించి నా ఇటీవల కేసుల సం ఖ్య క్రమేణా పెరుగుతోం ది. భూపాలపల్లి ఎమ్మె ల్యే దంపతులకు  పాజిటివ్‌ రావటంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

మహారాష్ట్ర నుంచి రాకపోకలు..

 భూపాలపల్లి జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర నుంచి భారీగా రాకపోకలు సాగుతున్నాయి. ప్రధానంగా ఆ రాష్ట్ర గడ్చిరోలి జిల్లా సరిహద్దుగా కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ శివారు పల్లెలు ఉన్నాయి. గడ్చిరోలి జిల్లా నుంచే నాగ్‌పూర్‌ పట్టణానికి ప్రధాన రహదారి కూడా ఉంది. ముఖ్యంగా వ్యాపారులు, ప్రయాణికులు కాళేశ్వరం మీదుగా సీరొంచ, గడ్చిరోలి నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లుతారు. నాగ్‌పూర్‌ రైల్వే జంక్షన్‌  ఉండటంతో అక్కడి నుంచి లారీల ద్వారా వ్యాపారులు సరుకులను దిగుమతి చేసుకుంటున్నారు. చాలా మంది కూడా భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, ములుగు, భద్రాది కొత్తగూడెం తదితర జిల్లాలకు వెళ్లేందుకు కాళేశ్వరం మీదుగా ప్రయాణిస్తుంటారు.  ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ప్రయాణికులు, వ్యాపారులు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వంతెన పైనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో పాటు కాళేశ్వరం ఆలయానికి కూడా భారీగా మహారాష్ట్ర నుంచి భక్తులు సందర్శిస్తుంటారు.  కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు కూడా ఆ రాష్ట్రం నుంచే కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో  కరోనా విజృంభిస్తున్న ప్రమాదం పొంచి ఉందని పర్యాటకులు, భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

సరిహద్దులో పటిష్ట చర్యలేవీ..?

పొరుగున మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లా అయినా భూపాలపల్లిలో వైద్య శాఖ అప్రమత్తం కాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో 45,216 కరోనా టె స్టులు నిర్వహించి, 3,765 మందికి  పాజిటివ్‌గా నిరాఽ్ధరించా రు. ఇవే కాకుండా వివిధ ప్రాంతాల్లో ప్రైవేటుగా టెస్టులు ని ర్వహించుకున్నవారు, పాజిటివ్‌ అని తెలిసి ఇంటి వద్ద సొం త వైద్యం చేసుకున్నవారిని కూడా పరిగణనలోకి తీసుకుం టే జిల్లాలో సుమారు 10వేల పాజిటివ్‌ కేసులు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. భారీగా కరోనా కేసులు నమోదైనా భూ పాలపల్లి జిల్లాలో ప్రస్తుతం రెండుమూడు కేసులు మాత్ర మే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో భారీగా కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యా శాఖ అప్రమత్తమై సరిహద్దులో కాళేశ్శరం, మేడిగడ్డ వంతెనల వద్ద తనిఖీలు చేపట్టడంతో పాటు అక్కడే థర్మల్‌ టెస్టులు నిర్వహించాలని స్థా నికులు డిమాండ్‌ చేస్తున్నారు. వంతెనల వద్ద చెక్‌ పోస్టు ఏ ర్పాటు చేసి రహదారి మూసి వేయడం... లేక మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం లాం టి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  మహారాష్ట్ర నుంచి వచ్చే లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు, ప్రయాణికులు ఇక్కడి హోటళ్లలో భోజనం, టీ, టిఫిన్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కరికి వైరస్‌ ఉన్నా జిల్లా మొత్తం వ్యాపించే అవకాశం ఉందని జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   


Updated Date - 2021-03-01T06:13:50+05:30 IST