ఆ మండలాల్లో డేంజర్‌

ABN , First Publish Date - 2021-07-23T05:35:33+05:30 IST

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు నెలకొంటున్నాయి. కొవిడ్‌కు థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాజిటివ్‌ రేటు పెరగడం కలవరపాటుకు గురి చేస్తోంది.

ఆ మండలాల్లో డేంజర్‌

పాజిటివ్‌ శాతం 12.5 నుంచి 60 వరకు

నిర్లక్ష్యం వీడకపోతే ప్రమాదమే

కొత్తగా 128 కేసులు నమోదు

కడప, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు నెలకొంటున్నాయి. కొవిడ్‌కు థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాజిటివ్‌ రేటు పెరగడం కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆ.. మండలాల్లో అయితే పాజిటివ్‌ రేటు వేగంగా 60 శాతంలోపు చేరడం కలవరపాటుకు గురి చేస్తోంది. గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రేటు 2.33 నుంచి 60 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని మండలాల్లో 12.5 శాతం పైనే పాజిటివ్‌ రేటు ఉంది. జనం కొవిడ్‌ నిబంధనలు వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు. దీంతో కొవిడ్‌ మహమ్మారి జిల్లాను వదలననే స్థితికి వచ్చింది. తాజాగా మరో 128 మంది కరోనా బారిన పడ్డారు. 


మరో 128 కేసులు నమోదు

జిల్లాలో మరో 128 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా సరాసరి పాజిటివ్‌ రేటు 2.0గా నమోదైంది. మొత్తం కేసులు 1,09,483కు చేరుకున్నాయి. యాక్టివ్‌ కేసులు 720, రికవరీ కేసుల సంఖ్య 1,08,145కి చేరింది. ఇప్పటి వరకు 688 మంది మృతి చెందారు. 


ఆ మండలాల్లో డేంజర్‌

జిల్లాలో 25 మండలాల్లో డేంజర్‌ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా పాజిటివ్‌ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. మండలాలను పరిశీలిస్తే పోరుమామిళ్లలో 5 మందికి పరీక్షలు చేయగా ముగ్గురిలో పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయింది. ఇక్కడ పాజిటివ్‌ రేటు 60 శాతంగా నమోదైంది. నందలూరులో ఏడుగురికి శాంపిల్స్‌ తీయగా నలుగురిలో వైరస్‌ నిర్ధారణ అయింది. 57.14గా నమోదైంది. 


మండలం శాంపిల్స్‌ పాజిటివ్‌ కేసులు పాజిటివ్‌ రేటు


పోరుమామిళ్ల 5 3 60

నందలూరు 7 4 57.14

పుల్లంపేట 50 27 54

అట్లూరు 12 6 50

రామాపురం 2 1 50

గోపవరం 7 3 42.86

కోడూరు 32 7 21.88

పెనగలూరు 11 2 18.18

సీకే దిన్నె 16 2 12.5

కమలాపురం 94 6 6.38

బద్వేలు 104 6 5.75

మైదుకూరు 64 3 4.69

వేంపల్లె 88 4 4.55

చిట్వేలి 94 4 4.26

సంబేపల్లె 78 3 3.85

పులివెందుల 153 5 3.27

ఖాజీపేట 127 4 3.15

గాలివీడు 68 2 2.94

కలసపాడు 35 1 2.86

సింహాద్రిపురం 106 3 2.83

లింగాల 36 1 2.78

వీరబల్లె 79 2 2.53

ప్రొద్దుటూరు 125 3 2.4

కడప 586 14 2.39

రాజంపేట 43 1 2.33

Updated Date - 2021-07-23T05:35:33+05:30 IST