ఆదమరిస్తే గల్లంతే

ABN , First Publish Date - 2022-07-04T06:36:06+05:30 IST

మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి వర్షాకాలం వస్తుందంటే చాలు వెన్నులో వణుకే. ఆ గ్రామంలో దాదాపు అన్నీ గిరిజన కుటుంబాలే

ఆదమరిస్తే గల్లంతే
పెదవాగు కోతతో ప్రమాదకరంగా ఉన్న ఎల్చిరెడ్డిపల్లి రోడ్డు

ప్రమాదకరంగా ఎల్చిరెడ్డిపల్లి రహదారి

మరమ్మతులు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం

పినపాక, జూలై 3: మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి వర్షాకాలం వస్తుందంటే చాలు వెన్నులో వణుకే. ఆ గ్రామంలో దాదాపు అన్నీ గిరిజన కుటుంబాలే. 50 ఏళ్లకు పైబడే ఇక్కడ నివసిస్తున్నారు. మూడు వైపులా దారులు మూసుకుపోయి నడక, రవాణా, ఏ ప్రయాణం సాగించాలన్నా తలకు మించిన ప్రయాసే. ఈ గ్రామానికి రెండు వైపులా ప్రవహించే పెద్దవాగు వర్షాకాలంలో ఉధృత రూపం దాల్చుతుంది. మరో వైపు అభయారణ్య భూమి ఉండడంతో వారికి ఇక మిగిలింది ఒకటే దారి. అది కూడా పెదవాగు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. నిత్యం ఈ దారిలో రాకపోకలు సాగించాలంటే అరచేత ప్రాణాలు పట్టుకుని వెళ్లాల్సిందే. గత ఏడాది వర్షాకాలం దెబ్బతిన్న ఈ రోడ్డును బాగుచేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ మార్గంలో నిత్యం రోజు వారీ పని చేసుకుని జీవించే కూలీలతో పాటు, ఇటు నుంచి వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉండడమే గాక దీనికి కూతవేటు దూరంలో కస్తూర్బా పాఠశాల, ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు కూడా ఉన్నాయి.

Updated Date - 2022-07-04T06:36:06+05:30 IST