ప్రమాదకరంగా విద్యుత స్తంభాలు

ABN , First Publish Date - 2022-07-07T05:41:15+05:30 IST

మండలకేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ వీధిలో విద్యుత సౌకర్యం కల్పించేందుకు కొన్ని దశాబ్దాల కిందట ఇనుప విద్యుత స్తంభా లను ఏర్పాటు చేశారు.

ప్రమాదకరంగా విద్యుత స్తంభాలు
తనకల్లులో కూలడానికి సిద్ధంగా వంగిన విద్యుత స్తంభం

తనకల్లు, జూలై 6: మండలకేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ వీధిలో విద్యుత సౌకర్యం కల్పించేందుకు కొన్ని దశాబ్దాల కిందట ఇనుప విద్యుత స్తంభా లను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వాటని మార్చలేదు. ప్రస్తతం అక్కడి ఓ విద్యుత స్తంభం అడుగు భాగం తుప్పు పట్టి కూలడానికి సిద్ధంగా ఉంది. గాలి బాగా వీచినప్పుడుల్లా ఆ స్తంభం ఊగుతోంది. దీంతో ఈ స్తంభం ఎప్పుడు కూలుతుందో, ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆ వీధిలో నివాసలున్న వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత అధికారులకు ఈ విషయం చెప్పినా స్పందించడంలేదని ఆవేదన చెందారు. వెంటనే విద్యుత స్తంభం మార్చాలని విజ్ఞప్తి చేశారు. 

త్వరలో మారుస్తాం : విద్యుత శాఖ ఏఈ

విద్యత స్తంభం తుప్పు పట్టిన విషయాన్ని మండల విద్యుత శాఖ ఏఈ రుహుల్లా దృష్టికి తీసుకెళ్లగా...  స్పందించిన ఆయన వెంటనే ఆ విద్యుత స్తంభం మార్పు చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆ ప్రాంతంలో నివాసమున్నవారు విద్యుత అధికారులతో సహకరించాలని తెలిపారు. 

ముదిగుబ్బ: మండలకేంద్రం నుంచి పులివెందులకు వెళ్లే రహదారిలో ఇనుప విద్యుత స్తంభం ప్రమాదకరంగా ఉంది. అది ఎప్పుడు కూలుతుం దోనని ప్రజలు, వాహనదారులు భయాం దోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం తాడిమర్రి మండ లం చిల్లకొండయ్యపల్లి వద్ద జరిగిన ఆటోఘటన గుర్తుకు చేసుకుంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్సకో అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ఆ విద్యుత స్తంభాన్ని తొలగించి మరొకటి ఏర్పాటుచేయాలని  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-07-07T05:41:15+05:30 IST