చేతికి అందే ఎత్తులో ఉన్న వైర్లు
కిందికి వేలాడుతున్న తీగలు
పొలాల్లో తక్కువ ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు
డీడీలు తీసిని పట్టించుకోని అధికారులు
ఏన్కూరు, మే 13: మండలలోని హిమాంనగర్ పంచాయతీ రాజులపాలెంలో విద్యుత్‌తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. పొలాలనుంచి వచ్చే విద్యుత్ లైన్‌కు సంబంధించిన తీగల లూజై మనిషి నిలబడితే అందే ఎత్తులో ఉన్నాయి. లూజు లైన్లుగా మారడంతో రైతులు అటువైపు వ్యవసాయ పనులకు వె ళ్లాలంటేనే భయపడుతున్నారు. విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ఉండడంతో కొంతమంది రైతులు తాత్కాలికంగా కర్రలను సపోరుటగా పెట్టారు. గాలి దుమారాలు వచ్చినప్పుడు ఇవి మరింత కిందకు వేలాడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు విద్యుత్లైన్ల దగ్గర కాపల ఉంటున్నారు. గ్రామానికి చెందిన ధరావత్ బాబులాల్ శిఽథిలావస్థలో ఉన్న లైన్లను మార్చికొత్తగా రెండుస్తంబాలు కోసం 8 ఏళ్ల క్రితం రూ.9600 డీడీ తీసీ కాళ్లరిగేలా అధికారులచుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా రైతు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. అదేవిధంగా ఆంగోతు లింగన్న పొలంలో ఏడాది క్రితం గాలి దుమారానికి స్తంబాలు ఒరిగి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. గ్రామానికి చెంది న పలువురు రైతులు విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నేటికి సమస్య పరిష్కారంకాలేదు. ఒక్క రాజులపాలెంలోనే కాకుండా మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దీనికితోడు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల మూగజీవాలు మృత్యవాత పడుతున్నాయి. హిమాంనగర్ గ్రామంలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి ఎద్దు మృతిచెందింది. ప్రమాదాలు జరగకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
9 ఏళ్లనుంచి తిరుగుతున్నా: ధరావత్ బాబులాల్, రాజులపాలెం
విద్యుత్ స్తంబాల కోసం 9 ఏళ్లక్రితం రూ.9600 డిడీ తీసాను. అప్పటినుంచి అధికారులు చుట్టు తిరుగుతున్నా. సమస్య పరిష్కారం కాలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనల మధ్య వ్యవసాయం చేస్తున్నా. విద్యుత్ వైర్లకు సపోర్టుగా కర్రలను అమర్చాను. గతంలో ఒకసారి విద్యుత్ తీగలు రాపిడి వల్ల పక్కనుడి చెరుకుతోట కాలిపోయింది. నష్టపరిహారంగా రూ.80వేలు చెల్లించారు. ఇప్పటికైనా అధికారులు కొత్త విద్యుత్ లైన్లు వేయాలి.
పొలంలో పనులకు ఇబ్బంది: ఆంగోతు లింగన్న, రాజులపాలెం
ఏడాదిక్రితం గాలి దుమారం వల్ల విద్యుత్ స్తంబాలు ఒరిగి తీగలు కిందకు వేలాడుతున్నా యి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలి తం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. పొ లంలో కూలీలు పనులు చేయడానికి, ప్లాట్లుచేయడానికి దుక్కులు దున్నడానికి వైర్లు ఉండడంతో ఇబ్బం ది కలుగుతుంది. ఈ ఏడాది పొలం దున్నకుండానే వదిలేశా. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.