ప్రమాదకరంగా ధాన్యం ఆరబోత

ABN , First Publish Date - 2021-10-24T04:48:18+05:30 IST

మండలంలోని గౌరవెల్లి, కుందనవానిపల్లి, గండిపలి, పోతారం(జే), నందారం, ధర్మారం గ్రామాల్లో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టారు. రోడ్లపై ధాన్యం కుప్పలు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు స్పందించడం లేదు.

ప్రమాదకరంగా ధాన్యం ఆరబోత
గౌరవెల్లి-కుందనవానిపల్లి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం

  రోడ్లపై ధాన్యం కుప్పలతో ప్రమాదాలు 

 పట్టించుకోని అధికారులు


అక్కన్నపేట, అక్టోబరు 23: ధాన్యం ఆరబోతకు వ్యక్తిగతంగా పంట కల్లాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా రైతులు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. ప్రతీ సీజన్‌లో వరి, మొక్కజొన్న, కంది పంటల తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. మండలంలోని గౌరవెల్లి, కుందనవానిపల్లి, గండిపలి, పోతారం(జే), నందారం, ధర్మారం గ్రామాల్లో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టారు. రోడ్లపై ధాన్యం కుప్పలు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు స్పందించడం లేదు. 


 

Updated Date - 2021-10-24T04:48:18+05:30 IST