ప్రమాదకరంగా కోనేరు

ABN , First Publish Date - 2021-12-12T02:41:24+05:30 IST

స్థానిక కోనేటిమిట్ట ప్రాంతంలోని కోదండరామాంజనేయ స్వామి ఆలయం ఎదరుగా ఉన్న కోనేరు ప్రమాదకరంగా మారింది.

ప్రమాదకరంగా కోనేరు
ప్రమాదకరంగా ఉన్న కోనేరు

 రోడ్డుపై నుంచి తక్కువ ఎత్తుతో ప్రహరి

 దాతలు స్పందించాలని విన్నపం

గూడూరు, డిసెంబరు 11: స్థానిక కోనేటిమిట్ట ప్రాంతంలోని కోదండరామాంజనేయ స్వామి ఆలయం ఎదరుగా ఉన్న  కోనేరు ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కోనేరు ప్రహరీ శిఽఽథిలావస్థకు చేరుకోవడం, రోడ్డు నుంచి ఎత్తు తక్కువగా మారడంతో ప్రమాదాలు జరుగుతాయని వారు ఆందోళన చెందుతున్నారు.ఆలయాలకు వచ్చే భక్తులు కోనేరులో కాళ్లు,చేతులు శుభ్రం చేసుకుని స్వామివారిని దర్శించుకునేం దుకు వీలుగా కొన్నేళ్ల క్రితం కోనేర్లను ఏర్పాటు చేశారు. కోదండరామాంజనేయస్వామి ఆలయానికి రెండు కోనేర్లు ఉన్నాయి. ఈ కోనేర్లు ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోకపో వడంతో శిఽథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయి. అయితే ఆలయం సమీపంలోని తెప్ప కోనేరును దాత కనుమూరు హరిచంద్రారెడ్డి సుమారు రూ.70 లక్షలు వెచ్చించి అభివృద్ధి పరిచారు.  ఆలయం ఎదరుగా ఉన్న కోనేరు మాత్రం ప్రమాదకరంగా మారింది. కాలక్రమంలో రోడ్డు ఎత్తు పెరగడంతో ప్రహరీ రోడ్డు నుంచి అడుగు ఎత్తు కూడా లేకుండా పోయాయి. పలువురు విద్యార్థులు పాఠశాలలకు ఈ మార్గంలోనే వెళుతుంటారు. దీంతో చిన్నారులు ఎత్తు తక్కువగా ఉన్న కోనేరులో నీటిని చూసేందుకు వెళితే ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాక ఇటీవల కురిసిన వర్షాలకు కోనేరులోపైకి నీరు చేరుకుని ఉంది. నీటిలో చెత్తాచెదారాలు చేరుకోవడంతో పాచిపట్టి పోయింది.  ప్రమాదకరంగా ఉన్న ఈ కోనేరుకు ప్రహరీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


ప్రమాదాలు జరిగే ఆస్కారం


కోదండరామాంజనేయస్వామి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు గోడలు రోడ్డు నుంచి ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఈ మార్గంలో వెళ్లే చిన్నారులు కోనేరులోకి చూస్తుంటారు. దీంతో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని భయాందోళనలు చెందుతున్నాం. దాతలు ముందుకు వచ్చి ప్రహరీ ఏర్పాటు చేయాలి.

 -ఽకార్తీక్‌, స్థానికుడు


విషజ్వరాలు సోకుతున్నాయి


ఈ కోనేరు దుస్థితికి చేరుకోవడంతో చెత్తాచెదారాలు పేరుకుపోయి దోమలు పెరిగాయి. దుర్వాసన వ్యాపిస్తుండడంతో స్థానికంగా నివాసం ఉండేవారు అవస్థలు పడుతున్నారు. విషజ్వరాలు సోకతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకు వచ్చి కంచె ఏర్పాటు చేయాలి.

-సాయి, స్థానికుడు







Updated Date - 2021-12-12T02:41:24+05:30 IST