డెంగ్యూ నివారణపై అవగాహన

Published: Mon, 16 May 2022 21:04:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 డెంగ్యూ నివారణపై అవగాహనర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

సంగం, మే 16: స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ప్రతిమ ఆధ్వర్యంలో సోమవారం  డెంగ్యూ నివారణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


       జాతీయ డెంగ్యూ దినోత్సవం

 ఏఎస్‌ పేట, మే16 : మండలంలోని చిరమన పీహెచ్‌సీలో సోమవారం వైద్యాధికారి డాక్డర్‌ రంతు న్నీసాబేగం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, దోమలు ప్రబలకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ ఎన్‌.జ్యోతి, ఆరోగ్యవిస్తరణాధికారి షఫీ, సలోమి తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.