డెంగ్యూపై డప్పు కళాకారులతో అవగాహన

ABN , First Publish Date - 2022-07-08T04:08:51+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెంలోని బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు సెంటర్‌లో గురువారం డప్పు కళాకారులు, వైద్య సిబ్బంది డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

డెంగ్యూపై డప్పు కళాకారులతో అవగాహన
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డప్పు కళాకారులు

బుచ్చిరెడ్డిపాళెం, జూలై7: బుచ్చిరెడ్డిపాళెంలోని బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు సెంటర్‌లో గురువారం డప్పు కళాకారులు, వైద్య సిబ్బంది డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూతోపాటు సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తతో జాగ్రత్తలు  పాటించాలని తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వలేకుండా ఉంచడం వల్ల దోమలు వ్యాప్తిని నివారించవచ్చని సూచించారు. డెంగ్యూ అని అనుమానం వస్తే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో జొన్నవాడ పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసన్నలక్ష్మి, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-07-08T04:08:51+05:30 IST