
హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్‌షాపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమని తలసాని సవాల్ విసిరారు. దమ్ముంటే రండి.. ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని తలసాని అన్నారు. మీరు గెలుస్తారో.. మేం గెలుస్తామో ప్రజలు నిర్ణయిస్తారని తలసాని చెప్పారు. అధికారంలో ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడతామంటే చెల్లదన్నారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా ఇలా మాట్లాడటం సరికాదని, పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అన్న అమిత్‌షా.. మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారని తలసాని ప్రశ్నించారు. గుజరాత్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు నిర్మించలేదని, కళ్లుండీ చూడలేని కబోదులు బీజేపీ నాయకులు అంటూ మంత్రి తలసాని విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి