
సికింద్రాబాద్: సీఎం కేసీఆర్ (Cm kcr) తమ ఆరోగ్యం జాగ్రత్త అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Bjp Mp Dharmapuri Arvind) అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభ (Vijaya Sankalpa Sabha)లో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలో మొదటిసారి ఓ ఆదివాసీ బిడ్డ ముర్ము రాష్ట్రపతి అవుతున్నారని.. కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బీజేపీని చూస్తే కేసీఆర్‌కు పూనకం వస్తుందన్నారు. బీజేపీని ప్రశ్నించే ముందు తమ ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ‘‘మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చావు. రైతులకు ఉచిత ఎరువులు ఏమయ్యాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైంది?. ఎనమిదేళ్ళ కేసీఆర్ పాలనలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. రాబోయేది కాషాయ ప్రభంజనం.’’ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి