ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా

Jul 30 2021 @ 01:14AM
దర్శిలో నిరసన తెలుపుతున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

కందుకూరు, జూలై 29: ప్రాథమిక పాఠశాలల పరిధిలోని 3,4,5 తరగతులను హైస్కూళ్లకు తరలించాలనే ఆలోచన విరమించుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.గురునాథశర్మ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిరుపేద కుటుంబాల విద్యార్థినీ విద్యార్థులు ప్రాథమిక విద్యకే దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నూతన విద్యావిధానాలను నిరసిస్తూ ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం స్థానిక సబ్‌ కలెక్టరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథశర్మ మాట్లాడుతూ... అంగన్‌వాడీలు, 1,2 తరగతులు ఒకచోట ఉంచి 3,4,5 తరగతులను హైస్కూళ్లకు తరలించాలన్న ఆలోచన అమలైతే గ్రామీణ  విద్యావ్యవస్థ భవిష్యత్తులో అగాథంలోకి వెళుతుందన్నారు. తద్వారా డ్రాప్‌ అవుట్లు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఆర్‌. హరిబాబు, ఎస్‌కె ఖాదర్‌బాషా, మునీర్‌బాషా, జి.వెంకటస్వామి, ఎస్‌ఎన్‌ ప్రసాదరావు, డి. భిక్షాలు, కేవీ.సురే్‌షబాబు, ఎ. బ్రహ్మయ్య, ఎనిమిది మండలాల నాయకులు, ఉపాధ్యాయులు, టీఎన్‌యూఎస్‌ నాయకులు ఎన్‌.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

దర్శి : ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా చేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.వీ.కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పీఆర్‌సీ అమలు చేయాలని, నూతన డీఏలు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షుడు వాకా.జనార్ధన్‌రెడ్డి, దర్శి తాలూకా పరిధిలోని ఏపీటీఎఫ్‌ నాయకులు ఎం.జాన్‌, షేక్‌ ఖాజారహంతుల్లా, సుబ్బారెడ్డి, కంఠా.శ్రీనివాసరావు, అశోక్‌చక్రవర్తి, ఖాజావలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం దర్శి డిప్యూటీ తహసీల్దార్‌ షాజిదాకు వినతిపత్రం సమర్పించారు.

కనిగిరి : నూతన విద్యావిధానంలో పాఠ్య ప్రణాళికలు మాత్రమే మార్చాలని, పాఠశాలలను విడదీయ వద్దని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాయబ్‌ రసూల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం ఉపాద్యాయులతో ఏపీటీఎఫ్‌ ఆద్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.  కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు ఒంగోలు వెంకటేశ్వర్లు, తోట శ్రీనివాసులు, మచ్చా ప్రసాద్‌, ఏ చెన్నయ్య, మాలకొండయ్య, ఆనంద్‌, రవీంద్ర, ఆరు మండలాల నాయకులు నజీర్‌, దండే శ్రీను, కెవి సుబ్బయ్య, ఎన్‌ రమేష్‌, కరణం శ్రీను, ప్రసాద్‌, గంధం ప్రసాద్‌, సునీతాదేవి, సంజీవరాణి, మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.