కొలువుదీరిన దర్వేశిపురం ఆలయ పాలకవర్గం

Jun 17 2021 @ 00:23AM
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్దికి పాటుపడాలి : కంచర్ల
కనగల్‌, జూన 16 :
మండలంలోని దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ పాలకవర్గం బుధవారం కొలువుదీరింది. ఆలయ చైర్మన నల్లబోతు యాదగిరి, తదితర పాలకవర్గ సభ్యులు ప్రమా ణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి పాటు పడాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని యా దాద్రి, చెర్వుగట్టు తర్వాత దర్వేశిపురం ఎల్లమ్మ ఆల యం ప్రసిద్ధి చెందిందన్నారు. ఎల్లమ్మ ఆలయం కోరిన కోర్కెలు నెరవేరుస్తూ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోందన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతుల కల్పిం చా లన్నారు. దాతల సాయంతో ఆలయం వద్ద నిర్మిస్తున్న మకర తో రణ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. నూతనంగా ఏర్పా టు చేసిన ఎల్లమ్మ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. రూ 2.5లక్షల నిదులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంబించారు. ఆలయానికి ఇరువైపులా రోడ్డును ఆక్రమించి వెలసిన దుకాణ  సముదాయాలను రోడ్డు బౌండరీ అవతలికి మార్చుకోవాలన్నారు. దర్వేశిపురం స్టేజీ వద్ద ఇరువైపులా అరకిలోమీటరు మేర ప్రధాన రహదారిని నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి నిధుల విడుదలకు కృషి చేస్తానన్నారు. ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో గల అసైన్డభూమిని ఆలయ విస్తరణలో భాగ ంగా సేకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్‌ ఏసీ మహేందర్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్మన సైదిరెడ్డి, ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ వెంకటేశంగౌడ్‌, వంగాల సహదేవరెడ్డి, ఐతగోని యాదయ్యగౌడ్‌, ఈవో ప్రభాకరసత్యమూర్తి, ఇనస్పెక్టర్‌ వెంకటలక్ష్మి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరావు, ఎంపీడీవో సోమసుందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీధర్‌రావ్‌, సర్పంచలు అంజమ్మ, పూలమ్మ, పగిళ్ల యాదయ్య, ఆలయ చైర్మన నల్లబోతుయాదగిరి, పాలకవర్గసబ్యులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.


Follow Us on: