బ్రహ్మచారిణిగా అమ్మవారు

ABN , First Publish Date - 2022-09-28T05:46:18+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి బ్రహ్మచారిణిగా దర్శనిచ్చారు.

బ్రహ్మచారిణిగా అమ్మవారు
మహానందిలో అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ

మహానంది, సెప్టెంబరు 27: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి బ్రహ్మచారిణిగా దర్శనిచ్చారు. ఆలయంలోని అమ్మవారికి అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల మంటపంలో దసరా ఉభయ దాతల చేత బుత్వికులు, వేదపండితులు వేదమంత్రాలతో హోమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలోని కళ్యాణ మంటపంలో సహస్ర దీపాలంకరణ సేవను జరిపారు. అమ్మవారిని బ్రహ్మచారి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల నుంచి పులి వాహనంపై బ్రహ్మచారి దుర్గను ఆశీనులు గావించారు. ఆలయం పురవీధుల గుండా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులతో పాటు ఏఈవో ఎర్రమల్ల మధు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, రంగన్న పాల్గొన్నారు.


మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిదానంలో వెలసిన మంచాలమ్మ దేవత మంగళవారం గజలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు మంగళవారం  పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు మధ్య మంచాలమ్మ దేవతకు విశేష పంచామృతాభిషేకం, కుంకుమ సేవ, ఆకులపూజ,  బంగారు, వెండి ఆభరణాలు, పట్టుచీర,  గజ వాహనంపై  అమ్మవారిని గజలక్ష్మి అలంకరణలో తీర్చిదిద్దారు. ఈ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. పీఠాధిపతి అమ్మవారికి మహా మంగళహారతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదించారు. దసరా ఉత్సవాలు సందర్భంగా కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆర్య వైశ్యులు సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవతను సింహ వాహనంపై బాల త్రిపుర సుందరిదేవిగా శోభాయమానంగా  అలంకరించారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్య లో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - 2022-09-28T05:46:18+05:30 IST