బాసరలో దసరా ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-08T01:28:15+05:30 IST

నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.

బాసరలో దసరా ఉత్సవాలు ప్రారంభం

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. విజయదశమి రోజు వరకు జరిగే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజైన గురువారం సరస్వతీ అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు అమ్మవారికి విశేష అభిషేక పూజలతో పాటు చండీయాగం నిర్వహించారు.

Updated Date - 2021-10-08T01:28:15+05:30 IST