దసరా ముగిసిందయ్యా..

ABN , First Publish Date - 2021-10-17T05:08:53+05:30 IST

దసరా ముగిందయ్యా.. సరదా తీరిందయ్యా..

దసరా ముగిసిందయ్యా..
భీమవరం ఎడ్వర్డు చెరువులో వాసవీమాత తెప్పోత్సవం

ముగిసిన దసరా సందడి

ఆకివీడు, అక్టోబరు 16 : దసరా ముగిందయ్యా.. సరదా తీరిందయ్యా.. 9 రోజుల పాటు అమ్మవార్లను కొలిచారు.. ప్రత్యేక అలంకరణలు చేశారు. శుక్రవారంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో శనివారం అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించి ఘనంగా నిమజ్జనోత్సవాలు చేశారు. ఊరూ వాడా ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. చివరి రోజు శుక్రవారం  ఆకివీడు పెద్దింట్లమ్మ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. రాత్రి శమీపూజ చేశారు. శనివారం పెద్దింట్లమ్మ గ్రామోత్సవం నిర్వ హించారు. ఈ నెల 20న అన్నసమారాధన చేపడుతున్నామని దేవస్థాన ఈవో సాగిరాజు రంగరాజు, బొమ్మారెడ్డి మాధవరెడ్డి తెలిపారు. శాంతినగర్‌లోని నూకాలమ్మ ఆలయానికి బెన్నాబత్తుల మహేష్‌–దేవిక దంపతులు రూ.40 వేలు విలువైన వెండి కిరీటం కమిటీ నిర్వాహకుడు గంధం ఉమాకు అందజేశారు. 


ఉండి : ఉండి రాజులవీధిలో ఉన్న శ్రీదేవి అమ్మవారి మండపంలో ఎమ్మెల్యే రామరాజు ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు మంతెన సాయిలచ్చిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను పూలమాలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్య క్షుడు జుత్తిగ శ్రీను, మోపిదేవి శ్రీను, మంతెన పద్మరాజు, కరిమెరక నాగరాజు,  శ్రీను పాల్గొన్నారు.


పాలకోడేరు : మోగల్లు రోడ్డు కొత్తపేట శ్రీవిజయ కనకదుర్గమ్మ, వేండ్ర రోడ్డులో సోమాలమ్మ, దుర్గమ్మ అమ్మవార్ల గ్రామోత్సవాలు ఘనంగా నిర్వహిం చారు. అర్చకుడు ధర్మేంద్ర ఫణిశర్మ మాట్లాడుతూ అమ్మవారిని గ్రామోత్సవంగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తామన్నారు. కార్యక్రమంలో భవానీలు పాల్గొన్నారు. 


పాలకొల్లు అర్బన్‌ :  శ్రీక్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతి దేవి,లక్ష్మీదేవిలకు ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని శ్రీవిజయ లక్ష్మీదేవిగా అలంకరించారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నాళం హేమరాజు క్షీరారామలింగేశ్వరస్వామికి వెండి శంఖం అందించారు. యడ్లబజారు కనకదుర్గ ఆలయంలో శమీ పూజలు చేశారు. పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన అమ్మవార్లను నరసాపురం ప్రధాన కాల్వలో నిమజ్జనం చేశారు.


మొగల్తూరు : మండలంలో అమ్మవారి ఆలయాలతో పాటు, పలు కూడళ్ళలో ఏర్పాటు చేసిన విగ్రహలను ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఊ రేగింపు నిర్వహించి శనివారం నిమజ్జనం చేశారు. ఆదివారం అన్న సమారాధ నలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. శనివారం వడయార్‌పేట అమ్మవారి ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు.


నరసాపురం టౌన్‌ : మునిసిపల్‌ కార్యాలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.వీసీ కామన నాగిని ప్రత్యేక పూజలు చేశా రు. ఎమ్మెల్యే ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఊరే గింపులో పాల్గొన్నారు. చినమామిడిపల్లిలో బళ్ళ మూర్తి సహకారంతో ఏర్పా టు చేసిన అమ్మవారికి ప్రత్యేక కుంకమ పూజలు చేశారు. కనకదుర్గ, దుర్గాదేవి, గంటాలమ్మ, కొండాలమ్మ, గోగులమ్మ ఆలయాల వద్ద భక్తులు పూజలు చేశారు.


ఆచంట :  కనకదుర్గమ్మ నిమజ్జనాలు శనివారం పెద్ద ఎత్తున జరిగాయి. అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగిస్తూ మేళతాళాలతో కోడేరు, కరుగోరుమిల్లి, పెదమల్లం, భీమలాపురం, గోదావరి రేవుల వద్దకు తీసుకు వెళ్లి నిమజ్జనం చేశా రు. కొడమంచిలిలో జక్కంశెట్టి వారి పాలెంనకు చెందిన మహిళలు అమ్మవారి ముందుండి కలశాలతో వెళ్లి నిమజ్జనం చేశారు. చివరి రోజైన శుక్రవారం అమ్మ వారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెదమల్లం మాచేనమ్మ, ఆచంట పార్వతీదేవి రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శన మిచ్చారు. పెదమ ల్లంలో అమ్మవారి తెప్పోత్సవం గోదావరిలో వేడుకగా సాగింది. కొడమంచిలిలో మావుళ్లమ్మను మాజీ మంత్రి పితాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  


కాళ్ళ : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీ అమ్మవారు విజ యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బొండాడ పోలేరమ్మ ఆల యాల వద్ద భక్తి శ్రద్ధలతో శమీ పూజలు చేశారు. జక్కరంలో క్షత్రియ కార్పొ రేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారిని దర్శించుకున్నారు. సీసలి సాయిబాబా ఆలయం నుంచి భక్తులు ఊరే గింపుగా తీసుకువచ్చిన బాబా విగ్రహానికి శివాలయంలో సర్రాజు ప్రత్యేక పూజ లు చేసి అభిషేకాలు నిర్వహించారు. కోమటిగుంట రామాలయం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది.


భీమవరంటౌన్‌/రూరల్‌ : మావుళ్లమ్మను భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు.14వ వార్డులోని మినీ షీర్డిలో సాయిబాబాకు ప్రత్యేక పూజ లు చేశారు. సమాధి పొందిన రోజును పురస్కరించుకుని సాయిబాబాను ప్రత్యేకంగా అలంకారంచేసారు.గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో అన్నపూర్ణదేవికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు.మెంటేవారితోటలోని బాలా త్రిపుర సుందరీ అమ్మవారి గ్రామోత్సవం ఆ ప్రాంత మహిళలు నిర్వహించారు. మార్వాడీ సమాజ్‌ ఆధ్వర్యంలో దుర్గామాతకు ఊరేగింపు నిర్వహించారు.యువతీ యువకులు చేసిన రాజస్థాని సంప్రదాయ దాండియా నృత్యం ఆకట్టుకుంది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారంరాత్రి ఎడ్వర్డు ట్యాంకులో వాసవీమాత తెప్పోత్సవాన్ని నిర్వహించారు.దాదాపు 30 ఏళ్ల తరువాత తెప్పోత్సవం నిర్వహించటంతో భక్తులు అదిక సంఖ్యలో హాజరై తిలకించారు. దిరుసుమర్రు,బేతపూడి, జొన్నల గరువు తదితర ప్రాంతాల్లో అమ్మవార్లను ఊరేగించారు.  


వీరవాసరం/పోడూరు : వీరవాసరం కనకదుర్గాంబ, కోట సత్తెమ్మ, గుండిపోచమ్మ ఆలయాల వద్ద శుక్రవారం రాత్రి శమీ పూజలు చేశారు. అమ్మవార్ల గ్రామోత్సవం శనివారం నిర్వహించారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాల క్షత్రియ దసరా ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ ఊరేగింపు నిర్వహించారు. 




Updated Date - 2021-10-17T05:08:53+05:30 IST