Dharani వల్ల రైతులు బిక్షగాళ్లగా మారారు: దాసోజు శ్రవణ్

ABN , First Publish Date - 2022-05-28T22:46:29+05:30 IST

ధరణి వల్ల భూమి ఉన్న రైతు బిక్షగాడుగా మారాడని ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.

Dharani వల్ల రైతులు బిక్షగాళ్లగా మారారు: దాసోజు శ్రవణ్

హైదరాబాద్: ధరణి వల్ల భూమి ఉన్న రైతులు బిక్షగాళ్లగా మారారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రైతు సంఘర్షణ సభ పెట్టాం.. 9 అంశాలతో రైతు భరోసా కల్పించడానికి వరంగల్ డిక్లరేషన్‌ని ప్రకటించాం.తెలంగాణ వ్యాప్తంగా 12 ఏళ్ల పిల్లాడికి సైతం డిక్లరేషన్‌ తెలిసేలా అవగాహన కల్పించాం. నెల రోజుల పాటు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నాం..జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌కి ఉన్న ఆశ తెలంగాణ రైతాంగానికి దురదృష్టకరంగా ఉంది. నేటికి  93 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిస్తే కేవలం 31 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు..ఈ ప్రభుత్వం తుగ్లక్ పరిపాలన అందిస్తుంది. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి కేసీఆర్‌కి మనుసు రావడం లేదని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.


ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. ‘‘మన సొమ్ము వందల కోట్లతో పంజాబ్ రైతులను ఆదుకుంటారు..మరి ఇక్కడ ఏమైంది..?కొనుగోలు కేంద్రాల్లో గన్ని బాగ్స్, టార్పాలిన్‌లు అందుబాటులో లేవు. లక్ష 4 వేల ఎకరాల్లో సోర్గం వేస్తే దానిని కొనే పరిస్థితి లేదు..దేనికి కూడా మద్దతు ధర రావడం లేదు..వడ్లల్లో 6-10 తోడు ఉందని రైతులను మోసం చేస్తున్నారు.. 36 లక్షల 68 వేల మంది రైతుల్లో 5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసే ప్రయత్నం చేశారు..వాటికి పూర్తిస్థాయిలో ఇవ్వకుండా వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు..8 వేల మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే వెయ్యి మందిని మాత్రమే గుర్తించారు..15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు...70 శాతం సాగు కౌలు రైతుల చేతిలోనే ఉంది..కౌలు రైతులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు..ప్రభుత్వం వారిని గుర్తించడం లేదు..వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.రైతు కూలీలకు భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.


పోడు భూములను హరితహారం పేరుతో గుంజుకొని హక్కు పత్రాలు ఇవ్వలేదు.ప్రతి గిరిజన రైతుకు, పోడు రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని  దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ‘‘బ్యాంకర్స్‌తో ముఖ్యమంత్రి మీటింగ్స్ ఎందుకు పెట్టరు.తెలంగాణలో రైతులకు రుణాలు ఇవ్వకుండా ఎగవేసే బడాబాబులకు రుణాలు ఇస్తున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న లక్షా 30 వేల కోట్లు ఎగవేసేలా ఉన్నాయి. రాష్ట్రంలో పంట నష్టపరిహారం ఇవ్వడం  లేదు..ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారు..అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో అంబేడ్కర్ పెరు తీసేసి కాళేశ్వరం పెట్టారు కమీషన్ ప్రాజెక్టులుగా మార్చుకున్నారు.గత కాంగ్రెస్ 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ఇప్పుటి ప్రభుత్వం ఏ ఒక్కటి పూర్తి చేయలేదు..రచ్చబండ ద్వారా కేసీఆర్ మోసాలు ఎండగడతాం’’ అని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-28T22:46:29+05:30 IST