డేటా డిలీట్‌ చేస్తే సరిపోతుందా?

ABN , First Publish Date - 2020-08-01T07:57:43+05:30 IST

నా పాత ఫోన్‌ అమ్మేశాను. అందులో కొన్ని వీడియోలు ఉన్నాయి. వాటిని డిలీట్‌ చేశాను.

డేటా డిలీట్‌ చేస్తే సరిపోతుందా?

నా పాత ఫోన్‌ అమ్మేశాను. అందులో కొన్ని వీడియోలు ఉన్నాయి. వాటిని డిలీట్‌ చేశాను. కానీ ‘ఫోన్‌ కొన్న వారు సాఫ్ట్‌వేర్‌ సాయంతో వాటిని రిట్రీవ్‌ చేసి నెట్‌లో పెడతారు, బ్లాక్‌మెయిల్‌ కూడా చేసే అవకాశం ఉంటుంది’ అని నా ఫ్రెండ్‌ అంటున్నాడు. నిజమేనా? - ప్రభ, హైదరాబాద్‌


ఫోన్‌లో ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కావచ్చు, మెమరీ కార్డ్‌ కావచ్చు.. డిలీట్‌ చేసిన డేటాని తిరిగి తీసుకు రావడానికి అనేక పద్ధతులు ఉన్నాయి.   మామూలుగా డిలీట్‌ చెయ్యడం మాత్రమే కాకుండా, ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేసినా కూడా అంతకుముందు భద్రపరచిన డేటాని తిరిగి తీసుకు రావచ్చు. అందుకే ఫోన్‌ ఎవరికైనా అమ్మేటప్పుడు డేటాని మామూలుగా డిలీట్‌ చెయ్యడం కాకుండా ఓ పద్ధతి అనుసరించాలి. మొదట అందులోని డేటాని ఎన్‌క్రిప్ట్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ రీస్టార్ట్‌ చేసి డేటా డిలీట్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాలి. ఈ పద్ధతి ద్వారా డేటా రికవర్‌ అయినా కూడా ఎన్‌క్రిప్టెడ్‌ డేటా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌ ఇలా డేటాని ఎన్‌క్రిప్ట్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఒకవేళ అలా ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తే పోలీసులను ఆశ్రయించాల్సిందే!

Updated Date - 2020-08-01T07:57:43+05:30 IST