అమ్మాయి కావాలా అంటూ Dating App లో పోస్ట్.. బేరం కుదుర్చుకుని చెరువు దగ్గరికెళ్లాక..!

ABN , First Publish Date - 2021-07-31T16:32:16+05:30 IST

ఆన్‌లైన్‌లోనే విటులను ఆకర్షించి బేరం కుదిరిన తర్వాత...

అమ్మాయి కావాలా అంటూ Dating App లో పోస్ట్.. బేరం కుదుర్చుకుని చెరువు దగ్గరికెళ్లాక..!

  • యాప్‌లో విటులను ఆకర్షిస్తున్న లేడీకి బేడీలు
  • యువతిని రక్షించిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : డేటింగ్‌ యాప్‌లో అర్ధనగ్న చిత్రాలు పోస్టుచేసి, విటులను ఆకర్షించి నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండా దేశానికి చెందిన మహిళను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చెర నుంచి యువతిని రక్షించి హోమ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉగాండా దేశానికి చెందిన నమిబిరూ సియానా.. 2017లో ఉగాండా నుంచి విజిటింగ్‌ వీసా మీద ఇండియాకు వచ్చింది. మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ టోలీచౌకీలో అద్దెగదిలో ఉంటోంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిని ఉగాండా నుంచి ఇండియాకు నమిబిరూ రప్పించింది. ఆ తర్వాత ఆ యువతిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది. అఫ్రికా అమ్మాయి కావాలా అంటూ డేటింగ్‌ యాప్‌లో ఫోన్‌నంబర్‌, ఫొటోలు అప్‌లోడ్‌ చేసింది.


ఆన్‌లైన్‌లోనే విటులను ఆకర్షించి బేరం కుదిరిన తర్వాత అవసరమైన చోటుకి యువతిని పంపించేది. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. డేటింగ్‌ యాప్‌లో కస్టమర్స్‌లా నటించి డెకాయ్‌ ఆపరేషన్‌ చేశారు. ఆమెతో బేరం కుదుర్చుకున్న తర్వాత బాలాపూర్‌ ఎక్స్‌రోడ్‌లోని మంత్రాల చెరువు వద్దకు రప్పించారు. అక్కడ మాటువేసిన పోలీసులు నమిబిరూ సియానాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చెర నుంచి యువతిని రక్షించారు. మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-31T16:32:16+05:30 IST