ఇలాంటి తండ్రి మాకు అవసరం లేదంటూ 18 ఏళ్ల కుమార్తె ఆవేదన.. ఆమె ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-06-13T18:45:13+05:30 IST

అతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.. ఒక కూతురు, కొడుకు ఉన్నారు.. గతంలో కాంట్రాక్టర్‌గా పని చేసిన అతను మద్యానికి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు..

ఇలాంటి తండ్రి మాకు అవసరం లేదంటూ 18 ఏళ్ల కుమార్తె ఆవేదన.. ఆమె ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చిందంటే..

అతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.. ఒక కూతురు, కొడుకు ఉన్నారు.. గతంలో కాంట్రాక్టర్‌గా పని చేసిన అతను మద్యానికి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు.. కూలి పని చేసే భార్యపైనే ఆధారపడి జీవించేవాడు.. పిల్లలను స్కూలుకు వెళ్లనిచ్చేవాడు కాదు.. భార్య తెచ్చిన డబ్బులతో తాగేవాడు.. ఆమెను రోజూ కొట్టేవాడు.. దీంతో ఆమె భర్తను వదిలేసి పిల్లలను తీసుకుని వేరే వెళ్లిపోయింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెపై సుత్తితో దాడి చేశాడు.. ఆమె మొహంపై, తలపై సుత్తితో కొట్టాడు.. అనంతరం గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.. స్థానికులు ఆమెను రక్షించి హాస్పిటల్‌కు తరలించారు.. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. 


ఇది కూడా చదవండి..

చెల్లి చనిపోయిందని ఫోన్‌కాల్.. 430 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం.. సోదరి చితిమంటలపైనే దూకేసిన అన్న..!


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సంగ్రామ్ సింగ్ రోజూ మద్యం సేవించి భార్య అనిత, పిల్లలు నిఖిత, నిఖిల్‌ను వేధించేవాడు. రోజూ తాగి ఇంటికి వెళ్లి భార్యను కొట్టేవాడు. పిల్లలను స్కూలుకు వెళ్లనిచ్చే వాడు కాదు. దీంతో అనిత మూడేళ్ల క్రితం భర్తను వదిలేసి, పిల్లలతో విడిగా జీవించడం ప్రారంభించింది. అప్పుడప్పుడు సంగ్రామ్ ఆమె దగ్గరకు వెళ్లి కలిసి జీవించమని ఒత్తిడి చేసేవాడు. అందుకు అనిత అంగీకరించలేదు. నాలుగు రోజుల క్రితం కూలి పనికి వెళ్తున్న అనితను సంగ్రామ్ అడ్డగించి సుత్తితో ఆమె తలపై కొట్టాడు. మొహం, శరీరంలోని ఇతర భాగాలపై కూడా కొట్టాడు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అనిత కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను రక్షించారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనితను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు బాధితురాలి కూతురి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. `అతను మా అమ్మను రోజూ కొట్టేవాడు. మమ్మల్ని ఎప్పుడూ చదువుకోనివ్వలేదు. మా పుస్తకాలు చింపేసేవాడు. మా వల్లే అమ్మ నాన్న నుంచి విడిపోయింది. అలాంటి తండ్రి మాకు అక్కర్లేదు. అతడిని జైలులో పెట్టాల`ని నిఖిత పేర్కొంది. నిందితుడు సంగ్రామ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.


Updated Date - 2022-06-13T18:45:13+05:30 IST