మనల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన మీ అమ్మతో ఇంకేం మాట్లాడతావ్.. అంటూ ఓ తండ్రి ఆగ్రహం.. వెంటనే కూతురు చేసిన పనికి..

ABN , First Publish Date - 2021-11-27T17:35:13+05:30 IST

గుజరాత్‌లోని సూరత్‌ పరిధిలోని సచిన్ ప్రాంతంలో..

మనల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన మీ అమ్మతో ఇంకేం మాట్లాడతావ్.. అంటూ ఓ తండ్రి ఆగ్రహం.. వెంటనే కూతురు చేసిన పనికి..

గుజరాత్‌లోని సూరత్‌ పరిధిలోని సచిన్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఆ చిన్నారి అమ్మతో ఫోనులో మాట్లాడుతానంటూ మెండికేసింది. తండ్రి ఆ అవకాశం కల్పించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లి తన సోషల్ మీడియా స్నేహితునితో ఐదు నెలల క్రితం వెళ్లిపోయింది. బాలిక మాత్రం తండ్రి దగ్గరే ఉంటోంది. ఆ చిన్నారి తరచూ తల్లిని గుర్తు చేసుకుంటూ రోదించేది. 


రోజూమాదిరిగానే బుధవారం స్కూలు నుంచి వచ్చాక అమ్మకు ఫోన్ చేస్తానంటూ తండ్రి దగ్గర మొండితనం చేసింది. తరువాత ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, శవ పంచనామా నిర్వహించి, అనంతరం సివిల్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. తరువాత ఆ చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి.. కుమార్తెకు దహన సంస్కారాలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆత్మహత్యకు తల్లే కారణమనే ఆరోపణలు వినవస్తున్నాయి. సోదరి ఆత్మహత్య అనంతరం ఆమె సోదరుడు అనారోగ్యం పాలయ్యాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పట్నా(బీహార్)కు చెందిన నీలేష్ శర్మ గత 30 ఏళ్లుగా సచిన్‌లోని సాయి దర్శన్ సొసైటీలో ఉంటూ ఎంఆర్ఎఫ్ టైర్ షోరూంలో ఉద్యోగం చేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం బబ్లీ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి వంశిక అనే కుమార్తె, వంశ్ అనే కుమారుడు ఉన్నారు. ఏడాది క్రితం బబ్లీకి సోషల్ మీడియాలో అంకిత్ దుబే అనే యువకునితో పరిచయం ఏర్పడి అది సన్నిహిత సంబంధానికి దారి తీసింది. ఈ నేపధ్యంలో ఐదు నెలల క్రితం బబ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలూ తండ్రి దగ్గరే ఉంటున్నారు.


 అయితే వీరు ఫోనులో తండ్రితో మాట్లాడుతామని అప్పడప్పుడూ మారాం చేస్తుంటారు. బబ్లీ వారం రోజుల క్రితం పిల్లలను కలిసేందుకు సూరత్ వచ్చింది. వారిని కలుసుకుని తిరిగి వెళ్లిపోయింది. బుదవారం మధ్యాహ్నం వంశిక స్కూలు నుంచి వచ్చి తల్లితో మాట్లాడతానని తండ్రి ముందు మొండికేసింది. అయితే తండ్రి తాను తన మొబైల్ ఫోను ఇవ్వనని, వేరే ఫోనులో సిమ్ కార్డు వేసి, ఫోను చేద్దామని కుమార్తెకు చెప్పాడు. వెంటనే కోపం తెచ్చుకున్న వంశిక గదిలోనికి వెళ్లి ఉరివేసుకుంది. దీనిని చూసిన నీలేష్ వెంటనే కుమార్తెను కిందకుదించి, స్థానికులు సహాయంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేయడంతో చిన్నారిని అక్కడకు తీసుకువెళ్లబోతుండగా, దారిలోనే చిన్నారి మృతి చెందింది. తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిన దగ్గరి నుంచి వంశిక బెంగపెట్టుకున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ తల్లిదండ్రులు గొవపడినప్పుడు అది పిల్లల మనసులపై విపరీతంగా ప్రభావం చూపుతుందన్నారు.

Updated Date - 2021-11-27T17:35:13+05:30 IST