అత్తను అప్పడాల కర్ర, స్టీల్ బకెట్‌తో కొట్టిన కోడలు.. ఆమె పరిస్థితి విషయం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Dec 1 2021 @ 06:48AM

అత్తా కోడళ్ల గొడవలు ప్రతి ఇంట్లో చూస్తూ ఉంటాము. కానీ ఆ గొడవలు కొన్నిసార్లు ఒకరినొకరు కొట్టుకునేంత వరకూ వెళతాయి. ఆ గొడవలలో మనం కోడళ్లను వేధించే అత్తలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ దేశ రాజధానీ ఢిల్లీ ఇటీవల జరిగిన ఘటనలో ఒక కోడలు నిస్సహాయురాలైన అత్తను కొట్టింది.


ఢిల్లీలోని సీమపురి ప్రాంతంలో ఒక 70 ఏళ్ల గీదా దేవి అనే మహిళకు ఇద్దరు కొడుకులున్నారు. వారిద్దరు తమ భార్యలతో వేరుగా ఉంటున్నారు. గోదా దేవికి కేవలం రూ.2,500 పింఛను వస్తుంది. ఇది సరిపడక అప్పుడప్పుడూ తన కొడుకుల వద్ద కాస్త డబ్బు తీసుకునేది. ఈ క్రమంలో నవంబర్ 25న తన వద్ద నెలాఖరులో డబ్బులు అయిపోవడంతో తన రెండో కొడుకు వద్దకు వెళ్లి కాస్త డబ్బులు ఇవ్వమని అడిగింది. అప్పుడు అక్కడే ఉన్న ఆమె కోడలు అనిత ఆమెతో గొడవ పెట్టుకుంది. అత్త అని చూడకుండా బూతులు తిట్టింది.


గోదాదేవి కూడా అనితకు బదులివ్వడంతో.. అనిత వంటగదికి వెళ్లి అప్పడా కర్ర తీసుకువచ్చి తన అత్త తలపై బలంగా కొట్టింది. ఆ తరువాత పక్కనే ఉన్న స్టీల్ బకెట్‌తో ఆమెపై దాడి చేసింది. దీంతో గోదా దేవి చేయి విరిగింది. ఆ తరువాత గోదా దేవిని తన కొడుకు కోడలు ఇంటి బయట పడేశారు. అప్పుడు అక్కడున్న ఇరుగుపొరుగువారు ఆమెను ఆస్పత్రికి చేర్చారు. నవంబర్ 27న గోదాదేవి తన కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుపుతు్న్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.