kill : తమ పెళ్లికి అంగీకరించలేదని కుమార్తె ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చింది...

Jul 29 2021 @ 10:18AM

బరేలీ (ఉత్తరప్రదేశ్): తమ పెళ్లికి తండ్రి అంగీకరించలేదనే కోపంతో కుమార్తె ప్రియుడితో కలిసి తండ్రినే హతమార్చి చెట్టుకు వేలాడదీసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ నగరంలో వెలుగుచూసింది. బరేలీలోని సంభాల్ గ్రామానికి చెందిన హర్పాల్ సింగ్ (46) తన కుమార్తె ప్రీతి ప్రేమ పెళ్లిని వ్యతిరేకించాడు. దీంతో పాటు తనకున్న 10 బిగాహాల భూమిని కూడా కుమార్తెకు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో పొలం వచ్చిన హర్పాల్ కు అతని కుమార్తె ప్రీతి, ప్రియుడు ధర్మేంద్రయాదవ్, మరో స్నేహితుడితో కలిసి మద్యం తాగించి ఇనుపరాడ్డుతో కొట్టి చంపి చెట్టుకు వేలాడదీశారు. భర్త హర్పాల్ మృతదేహంపై గాయాలు ఉండటంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కుమార్తె, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తమ పెళ్లిని వ్యతిరేకించినందువల్లే తండ్రిని చంపామని కుమార్తె ప్రీతి పోలీసులకు చెప్పింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.