తల్లి రెండో పెళ్లి గురించి ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పెట్టిన కూతురు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్

Published: Sat, 18 Dec 2021 17:00:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లి రెండో పెళ్లి గురించి ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పెట్టిన కూతురు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్

పెళ్లి వయసు పిల్లలున్న తల్లి రెండో పెళ్లి చేసుకుంటుందంటే.. సాధారణంగా పిల్లలెవరూ ఒప్పుకోరు. ఎదిగొచ్చిన పిల్లలను పెట్టుకుని.. ఈ వయసులో రెండో పెళ్లి ఏంటని ఇరుగుపొరుగు వారు కూడా గుసగుసలాడుకోవడం సాధారణమే. అయితే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒక్కోసారి పిల్లల తల్లులు కూడా రెండో వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఇటీవల జరిగింది. ఇద్దరు పిల్లలున్న ఓ తల్లి.. రెండో పెళ్లి చేసుకుంది. అయితే వారి కూతురు, 16ఏళ్ల కొడుకు మాత్రం తల్లికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. పైగా తల్లి పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూతురు, ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ సంతోషాన్ని పంచుకుంది. ఈ అంశంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు...

తల్లి రెండో పెళ్లి గురించి ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పెట్టిన కూతురు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్

కారణాలు ఏంటో తెలీకపోయినా ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పెళ్లి విషయం పిల్లలకు తెలిసినా వారు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. పైగా కూతురే స్వయంగా తల్లిని ముస్తాబు చేసింది. చేతులకు మెహందీ వేసి, పెళ్లికూతురుగా సిద్ధం చేసింది. పెళ్లిలో ప్రతి ఒక్క ఘట్టాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘అమ్మ పెళ్లి చేసుకుంటుందంటే నమ్మలేకపోతున్నా’’.. అంటూ క్యాప్షన్ పెడుతూనే మా తల్లి అభిప్రాయాన్ని  16ఏళ్ల తమ్ముడితో పాటూ నేనూ గౌరవిస్తున్నానంటూ ప్రస్తావించింది.

ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. ఒప్పించేందుకు ఫ్రెండ్స్‌తో ఆ కుర్రాడు చెప్పించిన అబద్ధం.. ప్రేయసి ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే..

ఈ పోస్టు వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పిల్లలు చాలా గొప్ప మనసుతో తల్లి అభిప్రాయాన్ని గౌరవించడం అభినందనీయం.. అంటూ ఒకరు కామెంట్ పెడితే.. మీ తల్లి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని మరొకరు స్పందించారు. కొందరు మాత్రం ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

వృద్ధురాలైన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులోకి వెళ్లాక ఈ కొడుకు చేసిన నీచమిది.. ఏం జరిగిందో ఆలస్యంగా ఆమె గ్రహించి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

భర్తకు తెలీకుండా మాజీ సర్పంచ్‌తో ప్రేమాయణం.. రేయింబవళ్లు ఫోన్లలో బిజీ.. ఓ రోజు పార్కులో వాకింగ్ చేస్తుండగా.. బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా.. ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్య.. వెనుకే గమనిస్తూ వెళ్లిన భర్త.. అక్కడ ఇద్దరినీ చూసి..నా భర్త నన్ను తిట్టాడు.. అంటూ పెళ్లయిన ఎనిమిదో రోజే ప్రియుడికి ఫోన్ చేసి చెప్పిందో భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!ఛీ..ఛీ.. అనుకుంటూ అంతా ముక్కుమూసుకునే ‘ఆ గాలి’తోనే లక్షలు సంపాదిస్తున్న యువతి..!videoఇన్‌స్టాగ్రాంలో చిగురించిన ప్రేమ.. ప్రియుడి కోసం ఇండియాకు వచ్చిన బాలిక.. ముంబైలోని మురికివాడలో గది అద్దెకు తీసుకుని..



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.