NTR Daughter: మధ్యాహ్నం 12 గంటల సమయంలో గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది: ఎన్టీఆర్ మనవరాలు

ABN , First Publish Date - 2022-08-02T00:05:35+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (Former Chief Minister NTR) నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మృతిపై కూతురు

NTR Daughter: మధ్యాహ్నం 12 గంటల సమయంలో గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది: ఎన్టీఆర్ మనవరాలు

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (Former Chief Minister NTR) నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మృతిపై కూతురు దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు దీక్షిత ఫిర్యాదుతో కేసు  పోలీసులు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి (Umamaheswari) ఆత్మహత్య చేసుకుందని దీక్షిత ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నామని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందని చెప్పారు. భోజన సమయం వరకు బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని ఉమామహేశ్వరి కూతురు దీక్షిత తెలిపారు. మధ్యాహ్నం 2:30కి ఉమామహేశ్వరి కూతురు దీక్షిత కాల్ చేసిందని పోలీసులు తెలిపారు. తన తల్లి ఆత్మహత్య చేసుకుందని సమాచారమిచ్చిందని చెప్పారు. మధ్యాహ్నం 2:45కి ఉమామహేశ్వరి నివాసానికి జూబ్లీహిల్స్ పోలీసులు వెళ్లారు. మధ్యాహ్నం3 గంటలకు ఉమామహేశ్వరి రూమ్‌లోకి పోలీసులు వెళ్లారు. దీక్షిత ఫిర్యాదుతో సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. ఈ పరిణామాలే ఆత్మహత్యకు దారితీశాయని సమాచారం. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఉన్న బెడ్రూంలో ఉమా మహేశ్వరి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమె మృతికి కారణం ఆత్మహత్యగా తెలియడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-08-02T00:05:35+05:30 IST