Viral Video: చనిపోయిన తండ్రి పాత దుస్తులను.. మధుర జ్ఞాపకంగా మార్చిన కూతురు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-07-01T01:34:01+05:30 IST

కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేక.. వివిధ రకాలుగా చూపిస్తుంటారు. కొందరు విలువైన వస్తువులను బహుమతిగా అందిస్తే.. మరికొందరు కొత్త బట్టలను కొనివ్వడం ద్వారా తమ అభిమానాన్ని..

Viral Video: చనిపోయిన తండ్రి పాత దుస్తులను.. మధుర జ్ఞాపకంగా మార్చిన కూతురు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..

కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేక.. వివిధ రకాలుగా చూపిస్తుంటారు. కొందరు విలువైన వస్తువులను బహుమతిగా అందిస్తే.. మరికొందరు కొత్త బట్టలను కొనివ్వడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ.. చనిపోయిన తన తండ్రి జ్ఞాపకంగా ఏదైనా తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఇంట్లోని తండ్రి పాత దుస్తులను సేకరించింది. చివరగా ఫాదర్స్ డే సందర్భంగా వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నిఖితా ఖిని అనే మహిళ.. చనిపోయిన తన తండ్రి జ్ఞాపకంగా ఏదైనా గుర్తుండిపోయే వస్తువును తయారు చేయించాలని నిర్ణయించుకుంది. రెండేళ్లుగా తన తండ్రికి సంబంధించిన పాత చొక్కాలను పోగేసింది. వాటన్నింటినీ టైలర్ వద్దకు పంపించింది. చివరగా వాటన్నింటితో తమ తండ్రికి ఇష్టమైన గులాబీ, నీలం రంగులు వచ్చేలా అందమైన బొంతను కుట్టించింది. ఈ బొంత ఎల్లప్పుడు మమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. అని వ్యాఖ్యానిస్తూ,  ఫాదర్స్ డే సందర్భంగా వీడియోను షేర్ చేసింది. తండ్రిపై ఆమెకు ఉన్న ప్రేమ.. నెటిజన్లను కట్టి పడేసింది. మీ ప్రేమను చూసి,  మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

విమానం ఎక్కాక షాకింగ్ ట్విస్ట్.. బ్యాగ్‌ను చెక్ చేయాలన్న సిబ్బంది.. బయపడుతూనే ఆ యువతి వెళ్తే..





Updated Date - 2022-07-01T01:34:01+05:30 IST