వరుడి ప్రవర్తన నచ్చక పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి.. అయినా పారిపోయి అతడినే పెళ్లాడిన ఆమె పరిస్థితి చివరకు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-05T21:23:42+05:30 IST

పెద్దల సమక్షంలో ఆ యువతీ యువకులిద్దరికీ పెళ్లి కుదిరింది.. నిశ్ఛితార్థం పూర్తవగానే ఆ యువతీయువకులిద్దరూ మొబైల్‌ ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించారు.

వరుడి ప్రవర్తన నచ్చక పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి.. అయినా పారిపోయి అతడినే పెళ్లాడిన ఆమె పరిస్థితి చివరకు ఏంటంటే..

పెద్దల సమక్షంలో ఆ యువతీ యువకులిద్దరికీ పెళ్లి కుదిరింది.. నిశ్ఛితార్థం పూర్తవగానే ఆ యువతీయువకులిద్దరూ మొబైల్‌ ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించారు.. ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు.. అయితే వరుడి ప్రవర్తన గురించి సమాచారం అందుకున్న వధువు తండ్రి ఆ పెళ్లిని రద్దు చేశాడు.. అయినా ఆ అమ్మాయి మాత్రం అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.. ఇంట్లో నుంచి పారిపోయి అతడిని వివాహం చేసుకుంది.. అయితే రెండు నెలలు కూడా పూర్తవక ముందే ఆమె ఈ నెల ఒకటో తేదీన మరణించింది. అత్తింటి వారు ఎవరికీ చెప్పకుండా ఆమె అంత్యక్రియలను కూడా పూర్తి చేసేశారు.  


ఇది కూడా చదవండి..

Bike Stunt Fail: బిజీ రోడ్డుపై బైక్‌తో స్టంట్.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే.. వైరల్ అవుతున్న వీడియో


ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గోరక్‌పూర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి 2020లో తన కుమార్తె ప్రియకు వినయ్‌తో వివాహం నిశ్చయించాడు. నిశ్ఛితార్థం కూడా పూర్తయిన తర్వాత లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. పెళ్లి ఫిక్స్ అయ్యాక వినయ్, ప్రియ మొబైల్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వినయ్‌ను ప్రియ బాగా ఇష్టపడింది. అయితే వినయ్‌కు చెడు అలవాట్లు ఉన్నాయని, అతడి ప్రవర్తన మంచిది కాదని తెలుసుకున్న రాజ్‌కుమార్ ఆ వివాహాన్ని రద్దు చేశాడు. అయితే ప్రియ మాత్రం వినయ్‌నే వివాహం చేసుకోవాలనుకుంది. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి వినయ్‌ను వివాహం చేసుకుంది. ఆగస్టు ఒకటో తేదీన ఆమె మరణించింది. అత్తింటి వారు ఎవరికీ చెప్పకుండా ఆమె అంత్యక్రియలను కూడా పూర్తి చేసేశారు.  


గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వినయ్ ఇంటికి వెళ్లి విచారణ ప్రారంభించారు. ప్రియ చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ప్రియ తండ్రి రాజ్‌కుమార్.. తన అల్లుడు, అతని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. కట్నం కోసం ప్రియను అత్తింటి వారు తరచుగా వేధించేవారని, అప్పుడప్పుడు కొట్టేవారని, వారే ప్రియను చంపేసి సాక్ష్యాలను తారుమారు చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వినయ్ కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-05T21:23:42+05:30 IST