PV Sindhu : పీవీ సింధుకి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అభినందనలు.. ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-08-09T18:47:28+05:30 IST

బర్మింగ్‌హామ్‌ వేదికగా ముగిసిన ‘కామన్‌వెల్త్ గేమ్స్ 2022’లో(Commonwealth Games) స్వర్ణం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu)కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

PV Sindhu : పీవీ సింధుకి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అభినందనలు.. ఏమన్నాడంటే..

హైదరాబాద్ : బర్మింగ్‌హామ్‌ వేదికగా ముగిసిన ‘కామన్‌వెల్త్ గేమ్స్ 2022’లో(Commonwealth Games) స్వర్ణం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu)కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) కూడా చేరాడు. సింధుకి అభినందనలు తెలియజేస్తూ ఓ ట్వీట్(Tweet) చేశాడు. ‘ వెల్‌డన్ పీవీ సింధు. అద్భుతమైన విజయం సాధించావు. పరిపూర్ణమైన గెలుపు’ అని కొనియాడాడు. 


కాగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ ఈవెంట్‌లో సింధు అద్భుత ప్రదర్శన చేసింది. కెనడా క్రీడాకారణి మిచెల్లీ లీపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది. దీంతో కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆమె తొలిసారి స్వర్ణం సాధించినట్టయ్యింది. గత కామన్‌వెల్త్ గేమ్స్‌-2018లో సింధు రజతానికే పరిమితమైంది. అయితే మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. ఇక అంతక్రితం 2014లో కాంస్యంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా కాంస్యం గెలుచుకుంది.



Updated Date - 2022-08-09T18:47:28+05:30 IST