‘సామీ సామీ’ అంటోన్న వార్నర్ కూతుళ్లు.. బన్నీ రిప్లై ఏంటంటే..

Published: Sun, 23 Jan 2022 17:42:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సామీ సామీ అంటోన్న వార్నర్ కూతుళ్లు.. బన్నీ రిప్లై ఏంటంటే..

‘పుష్ప’ మేనియా నుంచి డేవిడ్ వార్నర్ బయటకు రాలేకపోతున్నాడు. ఆ సినిమా విడుదలైన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో అతడు హల్ చల్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ‘పుష్ప’లోని ‘శ్రీవల్లీ’ పాటకు అతడు డ్యాన్స్ చేశాడు. తాజాగా ‘సామీ సామీ’ పాటకు తన కూతుళ్లతో స్టెప్పులేయించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘అమ్మ, నాన్నల కంటే ముందుగానే ‘సామీ సామీ’ పాటకు పిల్లలు డ్యాన్స్ చేయాలనుకున్నారు’’ అని కామెంట్ రాశాడు. వార్నర్ వీడియోకు అల్లు అర్జున్ కూడా రిప్లై ఇచ్చాడు. ‘‘సో క్యూట్’’ అని చెప్పాడు. ‘‘సామీ పాట ఆస్ట్రేలియాని ఊపేస్తోంది’’ అని ఒక నెటిజన్ తెలిపాడు. గతంలో డేవిడ్ వార్నర్ ‘బాహుబలి, అల వైకంఠపురంలో’ సినిమా పాటలకు కూడా డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. 


అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: పార్ట్-1’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాకు లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International