సహకారం.. సతమతం..

ABN , First Publish Date - 2021-02-13T06:32:32+05:30 IST

పాలకవర్గాలు లేక సహకార సంస్థ లు అడుగుముందుకు వేయలేక సతమతమవుతున్నాయి. రెండువా రాల క్రితం పీఏసీఎస్‌, డీసీసీబీ, డీసీ ఎంఎస్‌ల పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది.

సహకారం.. సతమతం..
డీసీసీబీ కార్యాలయం

పాలకవర్గాల పదవీ కాలం పూర్తి

ఎన్నికల కోడ్‌తో నియామకాల వాయిదా

నిలిచిన లావాదేవీలు.. విడుదల కాని రుణాలు


(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

పాలకవర్గాలు లేక సహకార సంస్థ లు అడుగుముందుకు వేయలేక సతమతమవుతున్నాయి. రెండువా రాల క్రితం పీఏసీఎస్‌, డీసీసీబీ, డీసీ ఎంఎస్‌ల పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది. ఎన్నికల కోడ్‌తో వీటి పాలకవర్గాల నియామకాలు నిలిచిపో యాయి. వైసీపీ హయాంలో 2019 ఆగస్టు నుంచి సొసైౖటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు పాలకవర్గాలను ప్రభు త్వం నామినేట్‌ చేసింది. వీరి పదవీ కాలం జనవరి నెలాఖరకు పూర్తయిం ది. దీంతో రెండువారాల నుంచి పీఏసీఎస్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో అన్నిరకాల కార్యకలాపాలు నిలిచిపో యాయి.


జిల్లాలో 168 పీఏసీఎస్‌లు, 43 డీసీసీబీ బ్రాంచ్‌లలో అన్నిరకాల రుణాల పంపిణీ ఆగిపోయింది. ప్రధా నంగా రుణాలు, రికవరీల గురించి పట్టించుకునే వారే లేకుండా పోయా రు. సొసైటీలు, డీసీసీబీల్లో డిపాజిట్లు పూర్తయిన వాటికి డబ్బు చెల్లించాల న్నా, రుణాలు మంజూరు చేయాలన్నా సీఈవో, చైర్మన్‌ ఇద్దరు సంతకాలు చేయాలి. ఇద్దరు సంతకాలు ఉంటేనే డబ్బు విడుదలవుతుంది. రెండు వారాల నుంచి జీతాలు, డిపాజిట్ల బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ మార్చి నెలాఖరు వరకు ఉంటుందని.. అప్పటి వరకు పరిస్థితి ఏమిటోనని అధికారులు ఆందోళన చెందుతున్నా రు.


  సొసైటీలు, డీసీసీబీలలో పాలక వర్గాలు లేని సమయంలో ప్రభుత్వం జిల్లా అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లు గా నియమిస్తుంది. డీసీఎంఎస్‌కు రైతుభరోసా జేసీ దినేష్‌కుమార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. డీసీసీబీకి ఎవరినీ నియమించలేదు. పీఎసీఎస్‌, డీసీసీబీల్లో స్వల్ప, దీర్ఘ కాలిక, రబీ రుణాల పంపిణీ ఆగిపో యింది.  రైతులు, పేదలకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సహకార సంస్ధలు నిరుపయోగంగా మారాయి. పాలక వర్గాలు లేక పోవడంతో డ్వాక్రారుణాల పంపిణీ ముందుకు సాగటంలేదు. డీసీఎంఎస్‌లో రైతుల నుంచి వ్యవ సాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడంలేదు. 


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం

సొసైటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. రైతుభరోసా జేసీ దినేష్‌కుమార్‌ను డీసీఎంఎస్‌ ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ నెల 22 తరువాత ఆయన బాధ్యత లు స్వీకరిస్తారు. సొసైటీలు, డీసీసీబీలో వివిధ రకాల చెల్లింపులకు ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.

-- రాజశేఖర్‌, డీసీవో

Updated Date - 2021-02-13T06:32:32+05:30 IST