దర్యాప్తు నివేదిక తారుమారుకు యత్నాలు?

ABN , First Publish Date - 2020-12-17T06:14:08+05:30 IST

డీసీసీబీ వినుకొండ బ్రాంచ్‌లో పెద్దఎత్తున బోగస్‌ రుణాలు ఇచ్చిన విషయమై దర్యాప్తు నివేదికను తారుమారు చేయించేందుకు భోక్తలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

దర్యాప్తు నివేదిక తారుమారుకు యత్నాలు?

డీసీసీబీ వినుకొండ బ్రాంచ్‌లో భారీగా బోగస్‌ రుణాలు

గుంటూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): డీసీసీబీ వినుకొండ బ్రాంచ్‌లో పెద్దఎత్తున బోగస్‌ రుణాలు ఇచ్చిన విషయమై దర్యాప్తు నివేదికను తారుమారు చేయించేందుకు భోక్తలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నివేదిక డీసీవో రాజశేఖర్‌కు అందితే అక్రమార్కులు అనేకమందిపై వేటు పడుతుందని... అలా జరగకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. డీసీసీబీ వినుకొండ బ్రాంచ్‌ పరిధిలో బొల్లాపల్లి, గుర్రపునాయుడుపాలెం, శావల్యాపురం, ఈపూరు, నూజెండ్ల, కారుమంచి, అంగలూరు, వినుకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు) వున్నాయి. వినుకొండ కేంద్రంగా డీసీసీబీ బ్రాంచ్‌ పనిచేస్తోంది. డీసీసీబీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, పీఏసీఎస్‌ సిబ్బంది సిండికేట్‌ అయి బ్యాంక్‌ సొమ్మును స్వాహాచేసినట్లు ఫిర్యాదులు రావటంతో సహకారశాఖ అధికారులు 51 సెక్షన్‌ దర్యాప్తు నిర్వహించారు. అసిస్టెంట్‌ ఆడిట్‌ అధికారులు ఆరునెలలపాటు ఈబ్రాంచ్‌ పరిధిలోని 8 శాఖలనుంచి పూర్తి వివరాలు సేకరించారు సుమారు వందమంది రైతులకు ఇచ్చిన రుణాలు బోగస్‌ అని తేలింది. మనుషులు లేకుండా బోగస్‌ పేర్లతో సొసైటీ సిబ్బంది రుణాలు ఇచ్చినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-17T06:14:08+05:30 IST