డీసీసీబీ చైర్మన్‌ నూతన ఛాంబర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-19T10:03:52+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ని సహకార బ్యాంక్‌ పైఅంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ చై ర్మన్‌ ఛాంబర్‌ను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు

డీసీసీబీ చైర్మన్‌ నూతన ఛాంబర్‌ ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌:  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ని సహకార బ్యాంక్‌ పైఅంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ చై ర్మన్‌ ఛాంబర్‌ను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనం తరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను లాభాల బాట లో నడిపించేలా సహకార బ్యాంకులు, సంఘాలు ప నిచేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా స హకార బ్యాంకుకు రాష్ట్రంలోనే గొప్ప చరిత్ర ఉందని, ఆ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో సహకార బ్యాంకుల పనితీరు రోజురోజుకూ మెరుగవుతోందని, రైతులకు ఉపయోగప డే విధంగా అనేక మార్పులు జరుగుతున్నాయన్నారు. రైతులకు అతి సమీపంగా సేవలందించేది సహకార స ంఘాలు, సహకార బ్యాంకులేనని అన్నారు. వీటి వల్ల రైతులకు రుణాలు ఇవ్వడమే కాకుండా ఎరువులు, విత్తనాలు అందుతున్నాయన్నారు. రైతుల ఽధాన్యాన్ని కొనుగో లు చేస్తూ రైతులకు సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయన్నారు. తాను ఉమ్మడి జిల్లా స హకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశానని, ఇప్పటి వర కు ఎంతో మంది అధ్యక్షులుగా పనిచేసి బ్యాంకు అభి వృద్ధికి పటిష్ఠమైన పునాది వేశారన్నారు.

Updated Date - 2020-10-19T10:03:52+05:30 IST