అల్లూరి పార్కుకు డీసీసీబీ రెండు ఏసీలు వితరణ

Published: Wed, 06 Jul 2022 01:34:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అల్లూరి పార్కుకు డీసీసీబీ రెండు ఏసీలు వితరణకృష్ణాదేవిపేట పార్కుకు ఏసీలను అందిస్తున్న డీసీసీబీ చైర్‌పర్శన్‌ చింతకాయల అనితకృష్ణాదేవిపేట, జూలై 5: గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కుకు రెండు ఏసీలను డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైసీపీ నాయకుడు సీహెచ్‌. సన్యాసిపాత్రుడు మంగళవారం స్థానిక సర్పంచ్‌ లోచల సుజాతకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు ఏసీలను బ్యాంకు తరపున అందించామన్నారు. వీటిని పార్కుకు వచ్చే పర్యాటకులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు చింతల బుల్లిప్రసాద్‌, చింతల మనోజ్‌, సహకార బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.