డీసీసీబీలో ‘శత’ సహకార దినోత్సవం

Published: Sun, 03 Jul 2022 01:38:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డీసీసీబీలో శత సహకార దినోత్సవంసహకార ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం

సహకార జెండాను ఆవిష్కరించిన చైర్మన్‌ ఆకుల వీర్రాజు

 కాకినాడ రూరల్‌, జూలై 2: కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సీఈవో ఆర్వీ నరసింహారావు అధ్యక్షతన 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు సహకార జెండాను ఆవిష్కరించి బ్యాంకు సిబ్బంది, పాలకవర్గ సభ్యులతో కలిసి సహకార ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్‌ మాట్లాడు తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలు జూలై 2న 100వ అంతర్జాతీయ సహకార దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయన్నారు. ఈ ఏడాది సహకార దినం నినాదమైన ‘సహకార సంస్థలు ఉత్తమ ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అనేదాన్ని బాగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లోని విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాన్ని చైర్మన్‌ అందజేశారు. కార్యక్రమంలో రామదాసు సహకార శిక్షణ కేంద్రం అధ్యాపకులు రామ్మోహన్‌రావు, డీసీసీబీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.