ప్రగతి బాటలో డీసీసీబీ

ABN , First Publish Date - 2022-06-24T04:50:11+05:30 IST

ప్రగతి బాటలో డీసీసీబీ

ప్రగతి బాటలో  డీసీసీబీ
జడ్పీ హాలులో జరిగిన మహాజన సభలో మాట్లాడుతున్న మార్నేని రవీందర్‌రావు

 పట్టా పాస్‌బుక్‌ ఉన్న ప్రతీ రైతుకు రుణం

 గోల్డ్‌ లోన్‌ కోసం ప్రతీ సంఘానికి రూ.1కోటి

 రెండేళ్లలో 98 శాతం రుణాల రికవరీ

 మహాజన సభలో చైర్మన్‌ మార్నేని రవిందర్‌రావు

హనుమకొండ టౌన్‌, జూన్‌ 23: తమ పాలకవర్గం వచ్చిన రెండేళ్లలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ప్రగతి బాటలోకి తీసుకువచ్చామని డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు తెలిపారు. గత పాలకవర్గం చేసిన తప్పిదాలతో అస్తవ్యస్తంగా మారిన డీసీసీబీని గాడిలో పెట్టామన్నారు. డీసీసీబీ మహాజన సభ గురువారం హనుమకొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం లో జరిగింది. సమావేశ ప్రారంభానికి ముందు రెండేళ్లలో బ్యాంకు పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు మాట్లాడారు.

రెండేళ్లలో రూ.760 టర్నోవర్‌ ఉన్న బ్యాంకును రూ.1500 కోట్లకు చేర్చామన్నారు. సి గ్రేడ్‌లో ఉన్న బ్యాంకును బి గ్రేడ్‌కు తీసుకురావడంతో పాటు రాష్ట్రస్థాయిలో 3వ స్థానానికి చేర్చా మన్నారు. ఈ పురోగతి వెనుక బ్యాంకు సిబ్బంది శ్రమ ఎంతగానో ఉందని కొనియాడారు. పట్టా పాస్‌బుక్‌ కలిగి ఉన్న ప్రతీ రైతుకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకు నుంచి ఇచ్చిన రుణాల రికవరీ 98శాతం ఉందన్నారు. డిపాజిట్ల సేకరణలో కొంత వెనుకబడి ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన రూ.430కోట్ల టార్గెట్‌ను అధిగ మించినట్లు ఆయన తెలిపారు. సంఘాల బలోపేతానికి ప్రణాళి కాబద్దంగా వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ సంఘం పలు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా బలోపేతం అవుతోందన్నారు. తాజాగా గోల్డ్‌ లోన్ల కోసం ప్రతీ సంఘానికి రూ.1కోటి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లకుగాను 35శాతం సబ్సిడీతో రుణాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీసీసీబీ నిర్వహించే మహాజన సభలకు రెండింటికీ వరుసగా గైర్హాజరైతే ఆ సంఘం సభ్యత్వం రద్దు చేస్తామని రవీందర్‌రావు స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు చెట్టుపల్లి మురళి, కె.హరిప్రసాద్‌, ఎన్‌.రంజిత్‌, ఎ.జగన్‌మోహన్‌రావు, బ్యాంకు సీఈవో చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. 

చైర్మన్‌ల అసహనం

డీసీసీబీ మహాజన సభలో సహకార సం ఘాల చైర్మన్‌లు అసహనం వ్యక్తం చేశారు. డీసీసీబీ చైర్మన్‌ను ఎన్నుకోవడానికి, సమావేశా లకు హాజరై చాయ్‌, బిస్కెట్‌లు తిని భోజనం చేసి వెళ్లడానికే పరిమితమయ్యామని అసం తృప్తి వ్యక్తం చేశారు. నర్సంపేట సహకార సంఘం చైర్మన్‌ మోహన్‌రెడ్డి, నల్లబెల్లి షీప్‌ సొసైటీ చైర్మన్‌ రాజుతో పాటు పలువరు చైర్మన్‌లు మాట్లాడారు. రెండేళ్లుగా ప్రతీ సమా వేశంలో తమకు ప్రొటోకాల్‌ వర్తింపచేయాలని, గౌరవ వేతనం ఇవ్వాలని తాము అడగడం.. పాలకవర్గం ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడం షరామామూలుగానే జరుగుతోందని అన్నారు. తమ గోడును పాలకవర్గం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎందుకు పరిష్కరించలేకపోతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ఎమ్మెల్యేలు సైతం స్పందించకపోవడం విచారకరమన్నారు. జఫర్‌ గడ్‌ సహకార సంఘం చైర్మన్‌ కరుణాకర్‌ మా ట్లాడుతూ.. సంఘాల బలోపేతానికి బ్యాంకు స హకరించాలన్నారు. అన్నిరకాల రుణాలు ఇ చ్చేందుకు రూ.75లక్షల బ్యాంకు గ్యారెంటీ సం ఘాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. డైరెక్టర్‌ హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. సంఘాల చైర్మన్‌ల డిమాండ్‌ల విషయంలో ముఖ్యమం త్రి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2022-06-24T04:50:11+05:30 IST