విలీన నిరసనలపై డీ వైఈఓ విచారణ

ABN , First Publish Date - 2022-07-07T05:38:13+05:30 IST

పట్టణంలోని మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాల విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టడంపై బుధవారం డీవైఈఓ రంగస్వామి.. విచారణ చేపట్టారు.

విలీన నిరసనలపై డీ వైఈఓ విచారణ
డీవైఈఓకు వినతిపత్రం అందిస్తున్న తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

 హిందూపురం టౌన, జూలై 6: పట్టణంలోని మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాల విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టడంపై బుధవారం డీవైఈఓ రంగస్వామి.. విచారణ చేపట్టారు. మంగళవారం పాఠశాలకు తాళాలువేసి, ఉపాధ్యాయులను బయటకు పంపి, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టిన విషయం విదితమే. దీంతో డీవైఈఓ రంగస్వామి.. పాఠశాలకు వచ్చి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మేళాపురం ప్రథమిక పాఠశాల నుంచి దండు రోడ్డులోని ఉన్నత పాఠశాలకు ఎంత దూరం ఉందో తెలుసుకునేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎ్‌ఫఐ, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు.. ఆయనకు వినతి అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలను విలీనం చేయవద్దని కోరారు. ఎస్‌ఎ్‌ఫఐ బాబావలి, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, పాఠశాల విలీనాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీవైఈఓ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.


Updated Date - 2022-07-07T05:38:13+05:30 IST