మరో వారం రోజుల్లో తిరిగి వెళ్తాడనగా NRI మృతి.. రోడ్డు పక్కన చెట్ల పొదల్లో డెడ్ బాడీ..

ABN , First Publish Date - 2022-05-17T01:23:00+05:30 IST

చాలా రోజుల తరువాత అతడు ఇటీవలే ఇండియాకు వచ్చాడు. కొన్ని రోజుల పాటు కుటుంబం సభ్యులతో సరదాగా గడిపాడు. మరో వారంలో అతడు తిరుగుప్రయాణమవ్వాలి. ఇంతలో జరిగిన అనూహ్య ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. రోడ్డుపై అతడి మృతదేహం కనిపించడంతో..

మరో వారం రోజుల్లో తిరిగి వెళ్తాడనగా NRI మృతి.. రోడ్డు పక్కన చెట్ల పొదల్లో డెడ్ బాడీ..

ఎన్నారై డెస్క్: చాలా రోజుల తరువాత అతడు ఇటీవలే ఇండియాకు వచ్చాడు. కొన్ని రోజుల పాటు కుటుంబం సభ్యులతో సరదాగా గడిపాడు. మరో వారంలో అతడు తిరుగుప్రయాణమవ్వాలి. ఇంతలో జరిగిన అనూహ్య ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. రోడ్డుపై అతడి మృతదేహం కనిపించడంతో అతడి కుటుంబసభ్యుల రోదనలు ఆకాశాన్నంటాయి. పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్ జిల్లాలో ఇటీవల ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


దినానగర్ గ్రామానికి చెందిన కరణ్‌వీర్ సింగ్  చాలా కాలంగా ఇటలీలో ఉంటున్నాడు. ఇటీవలే అతడు తన స్వగ్రామానికి వచ్చాడు. వచ్చే వారం మళ్లీ ఇటలీకి తిరిగెళ్లేందుకు టిక్కెట్లు కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అతడు మోటర్ సైకిల్‌పై బయటకు వెళ్లాడు. అయితే.. అతడు ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది.  రాత్రి వరకూ అతడి కోసం వేచి చూశాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరణ్‌  కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు అతడి మృతదేహం మరుసటి రోజు ఉదయం లభ్యమైంది. ఓ వీధి పక్కన విగజీవుడుగా పడిఉన్న అతడిని వారు గుర్తించారు. అప్పటికే అతడు మృతి చెందడంతో పోలీసుల కరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 


కాగా.. రోడ్డు ప్రమాదంలో కరణ్ మరణించి ఉంటాడని కొందరు స్థానికులు అనుమానిస్తున్నారు. కానీ.. అతడిని ఎవరో చంపేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. అయితే.. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. సెక్షన్ 175 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. కరణ్ ఇలా అనూహ్యంగా మరణించడంతో అతడి కుటుంబసభ్యులను ఊరడించడం ఎవ్వరితరం కావట్లేదు. అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 




Updated Date - 2022-05-17T01:23:00+05:30 IST