
వారం రోజుల క్రితం పోలీసులక ఒక వ్యక్తి మృతదేహం లభించింది. ఆ శవం ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమై పోయింది. శవం వద్ద దొరికిన ఆధార్ కార్డు ప్రకారం మృతుడి తల్లిదండ్రులను పోలీసులు పిలిచారు. వారు కూడా చనిపోయింది తమ కొడుకే అని చెప్పారు. కానీ అనుకోకుండా ఒక డ్రగ్స్ కేసులో ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని గురించి ఆరా తీస్తే వారం రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి ఇతనే అని తేలింది. దీంతో పోలీసులు ఏదో కుట్ర జరిగిందని అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోడ్ గఢ్లో నాలుగు రోజుల క్రితం ఒక బైక్, ఒక మృతదేహం లభించింది. ఆ మృతదేహం ముఖంగుర్తుపట్టలేనంగా గాయాలు ఉండడంతో శవం వద్ద దొరికిన ఆధార్ కార్డుని పోలీసులు చూశారు. అందులో మృతుడి పేరు రవీంద్ర సింగ్(35) అని ఉంది. ఆ తరువాత పోలీసులు ఆధార్ కార్డు ఆడ్రస్ ఆధారంగా రవీంద్ర సింగ్ తల్లిదండ్రులను పిలిచి శవం చూపించారు. వారు శవం వేసుకున్న బట్టలు చూసి చనిపోయింది తమ కొడుకు రవీంద్ర సింగ్ అని చెప్పారు. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని అంతక్రియలకు వారికి అప్పగించేశారు.
కానీ మార్చి 25న ఒక వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. అతని పేరు రవీంద్ర సింగ్ అని చెప్పాడు. పైగా అతని అడ్రస్ కూడా చనిపోయిన వ్యక్తి వద్ద దొరికిన ఆధార్ కార్డులో ఉన్నట్లే చెప్పాడు. ఇదంతా విని పోలీసులు అతడు చెప్పేది నిజమని ధృవీకరించుకునేందుకు రవీంద్ర సింగ్ తల్లిదండ్రులను మళ్లీ పోలీస్ స్టేషన్కు పిలిచారు. వారు ఇతనే తమ కొడుకు అని చెప్పారు. ఇంతకు మందు దొరికిన శవం వేసుకున్న బట్టల ఆధారంగా అప్పుడు అలా చెప్పామని అన్నారు. దీంతో పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు విచారణ మొదలుపెట్టారు.
శవం పక్కన దొరికిన మోటర్ బైక్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి