చనిపోయిన వ్యక్తికి కొవిడ్ టీకా సర్టిఫికెట్

ABN , First Publish Date - 2021-12-11T22:18:18+05:30 IST

పురుషోత్తం షాక్యవర్ (78) అనే వ్యక్తి బయోరా పట్టణంలో మే నెలలో మరణించారు. కాగా ఆయన డిసెంబర్ 3న సెకండ్ డోస్ కొవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నారని, ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకొమ్మంటూ ఆయన ఫోన్‌కు సందేశం వచ్చింది..

చనిపోయిన వ్యక్తికి కొవిడ్ టీకా సర్టిఫికెట్

భోపాల్: మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17న నిర్వహించిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో చాలా మందికి రెండవ డోస్ టీకా తీసుకోకపోయినప్పటికీ తీసుకున్నట్లు తప్పుడు లెక్కలు చెప్పారనే విమర్శలు వచ్చాయి. రెండవ డోస్ టీకా తీసుకోకున్నప్పటికీ తీసుకున్నట్లు సందేశం వచ్చిందని అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు కూడా. కాగా, తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన.. మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ఏడు నెలల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి సెకండ్ డోస్ టీకా తీసుకున్నట్లు ఆయన ఫోన్‌కు సందేశం వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన.


పురుషోత్తం షాక్యవర్ (78) అనే వ్యక్తి బయోరా పట్టణంలో మే నెలలో మరణించారు. కాగా ఆయన డిసెంబర్ 3న సెకండ్ డోస్ కొవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నారని, ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకొమ్మంటూ ఆయన ఫోన్‌కు సందేశం వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. అయితే పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున డేటా ఎంట్రీ సమయంలో తప్పుడు నంబర్ కొట్టి ఉంటారని, అందుకే ఇలాంటి పొరపాటు జరిగిందని బయోరా పట్టణ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరద్ సాహూ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-11T22:18:18+05:30 IST