జిల్లా ఆసుపత్రిలో డెడ్‌బాడి తారుమారు

ABN , First Publish Date - 2021-04-17T06:35:45+05:30 IST

ఆసుపత్రి వైద్యుల అలసత్వంతో నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌తో మృతి చెందిన మృతదేహాలు తారుమారు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్‌కు చెందిన నర్సుబాయి, ఇస్లాంపూరకు చెందిన బీబీలు ఇద్దరు జిల్లాఆసుపత్రిలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు. అయితే వీరు ఇ

జిల్లా ఆసుపత్రిలో డెడ్‌బాడి తారుమారు

ఒకరి మృతదేహాన్ని మరొకరికి అందజేసిన సిబ్బంది

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 16: ఆసుపత్రి వైద్యుల అలసత్వంతో నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌తో మృతి చెందిన మృతదేహాలు తారుమారు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్‌కు చెందిన నర్సుబాయి, ఇస్లాంపూరకు చెందిన బీబీలు ఇద్దరు జిల్లాఆసుపత్రిలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు. అయితే వీరు ఇరువురు చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. కరోనా వ్యాధితో మృతి చెందడంతో మృత దేహాలను ప్యాక్‌ చేసి ఒకరి మృతదేహాన్ని మరొకరి బంధువులకు మార్చి ఇచ్చారు. దీంతో నర్సుబాయి బంధువులు బీబీ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తీర నర్సుబాయి మృతదేహం ఆసుపత్రి లోనే ఉందంటూ సమాచారం రాగా, అక్కడికి వెళ్లిన బంధువులు ఆశ్చర్య పోయి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మృతదేహాలు తారుమారు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఆసుపత్రి ప్రాంగ ణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరేద్దరే కాకుండా ఇతర ఆసుప త్రులలోనూ నలుగురు మృతి చెందారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో తీవ్ర కలవరం ఏర్పడుతోంది.

Updated Date - 2021-04-17T06:35:45+05:30 IST