5వ తరగతి ప్రవేశానికి 29 వరకు గడువు

ABN , First Publish Date - 2022-06-25T05:27:11+05:30 IST

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు ఈ నెల 29లోపు ఎంపికైన పాఠశాలలలో రిపోర్టు చేయాలని ఆ సంస్థ నిజామాబాద్‌ రీజియన్‌ ఇన్‌చార్జి ఆర్సీవో సత్యనారాయణ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు చరవాణి ద్వారా ప్రధానచార్యులు సమాచారం ఇది వరకే ఇచ్చారని తెలిపారు.

5వ తరగతి ప్రవేశానికి 29 వరకు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 24 : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు ఈ నెల 29లోపు ఎంపికైన పాఠశాలలలో రిపోర్టు చేయాలని ఆ సంస్థ నిజామాబాద్‌ రీజియన్‌ ఇన్‌చార్జి ఆర్సీవో సత్యనారాయణ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు చరవాణి ద్వారా ప్రధానచార్యులు సమాచారం ఇది వరకే ఇచ్చారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందుబాటులో ఉన్న సర్టిఫికెట్లు ఒరిజినల్‌, జిరాక్స్‌ ఆయా పాఠశాలలో గడువు తేదీలోగా రిపోర్టు చేయాలన్నారు. చేయని విద్యార్థుల సీట్లు రద్దు చేస్తామని తెలిపారు. ఈ తర్వాత ఎటువంటి అభ్యర్థనలు అంగీకరించబడాయని తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయం గమనించాలని ఇన్‌చార్జి ఆర్సీవో కోరారు. 

బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం 

సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలలో 2022-23 సంవత్సరానికి 6 నుంచి 9 తరగతి వరకు బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దర ఖా స్తులు ఆహ్వానిస్తున్నట్ల ఇన్‌చార్జి ఆర్పీవో సత్యనారాయణ తెలిపారు. విద్యా ర్థులు సాంఘిక సంక్షేమ గురకులాలల వెబ్‌సెట్‌ ద్వారా జూలై 4వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష జూలై 31 న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌, రం గారెడ్డి, గౌలిదోడ్డి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సాలెన్స్‌ కళాశాలలో 9వ తరగతిలో రెగ్యూలర్‌ అడ్మిషన్‌ కోసం ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. 

Updated Date - 2022-06-25T05:27:11+05:30 IST