గడువులోపు గగనమే!

ABN , First Publish Date - 2020-09-15T10:43:04+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో ఖరీఫ్‌ రుణ పంపిణీకి గడువు ముగుస్తోంది. రుణాల పంపి ణీకి ఇంకా 15 రోజులే

గడువులోపు గగనమే!

జిల్లాలో రుణ పంపిణీకి ముగుస్తున్న గడువు

నెలాఖరు వరకే ఖరీఫ్‌ రుణాల పంపిణీ

జిల్లాలో ఖరీఫ్‌ రుణ లక్ష్యం రూ.2,054 కోట్లు

ఇప్పటి వరకు ఇచ్చింది రూ.929 కోట్లే

రుణమాఫీ అవుతుందని రైతుల ఎదురుచూపు

రుణాల రీషెడ్యూల్‌కు ముందుకు రాని వైనం

రీ షెడ్యూల్‌ చేసుకొని రైతులంతా రుణాలు తీసుకోవాలని కలెక్టర్‌ పిలుపు


నిజామాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలో ఖరీఫ్‌ రుణ  పంపిణీకి గడువు ముగుస్తోంది. రుణాల పంపి ణీకి ఇంకా 15 రోజులే సమయం ఉంది. నిర్ణయించి న లక్ష్యంలో ఇప్పటికి 50 శాతం రుణ పంపిణీ కూడా చేయలేదు. రుణ మాఫీ అవుతుందని ఇప్పటి వరకు వే చి చూసిన రైతులు రీ షెడ్యూల్‌ చేయకపోవడంతో అ నుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. మెజారిటీ రైతులకు అందడం లేదు. కలెక్టర్‌ వారం వారం సమీక్షించినా ఇప్పటికీ గడువులోపు లక్ష్యం నెరవేరడం లేదు. రుణాల కోసం స్కేల్‌ ఆఫ్‌ ఫైౖనాన్స్‌ పెంచినా ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో రైతులందరికీ ఈ ఖరీఫ్‌లో రూ.2,054 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.


జిల్లాలో సన్న, చిన్న కారు రైతులందరికీ రుణా లు ఇవ్వాలని బ్యాంకర్‌ల కమిటీలో నిర్ణయించారు. స్కే ల్‌ ఆఫ్‌ ఫైౖనాన్స్‌ను పెంచారు. కరోనా రావడం.. బ్యాంకు లలో ఇతర పనులు ఉండడం వల్ల ఇప్పటివరకు అను కున్న లక్ష్యం నెరవేర లేదు. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్ప టి వరకు రూ.929 కోట్ల రుణాలు ఇచ్చారు. జిల్లాలో అ నుకున్న లక్ష్యంలో కేవలం 45 శాతం రుణాలు మాత్ర మే ఇచ్చారు. జిల్లాలో రుణాలకు అర్హులైన రైతులు 2 లక్షల 78 వేలకు పైగా ఉండగా.. ఇప్పటి వరకు 98 వే ల మందికి  మా త్రమే రుణాలను పంపిణీ చేశారు. గ డిచిన మూడు నెలలు కరోనా తీవ్రంగా ఉండడం వల్ల రుణ పంపిణీ ఎక్కువగా కాలేదు. రైతులు కూడా రుణ మాఫీ కాకపోవడంతో ఎక్కువ మంది తీసుకోలేదు.


నెలాఖరులోపు అసాధ్యమే

జిల్లాలో ప్రస్తుతం ఉన్న గడువులో రుణాలు పంపి ణీ చేయడం అసాధ్యంగా మారింది. పదిహేను రోజు లలో ఎంత చేసినా మరో ఇరవై శాతం మేరకే రుణ పంపిణీ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో అసెంబ్లీలో ప్ర కటించింది. లక్ష రూపాయాల లోపు రుణాలు ఉన్న రై తులవి మాఫీ చేస్తామని తెలిపింది. జిల్లాలో మొద టి విడతగా 25 వేలలోపు ఉన్న వారివి మాఫీ చేశారు. మి గతా రైతులవి మాఫీ కాలేదు. ఆ రైతులు రుణాలు మాఫీ అవుతాయని తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్‌ చేయడం లేదు. కొత్త రుణాలకు రావడం లేదు. వడ్డీ పె రుగుతున్నా ప్రయత్నాలు చేయడంలేదు. కొంత మంది రైతులు మాత్రం వడ్డీ తగ్గుతుందని రుణాలు రీ షె డ్యూల్‌ చేసుకుంటున్నారు. కొత్త రుణాలు తీసుకుంటు న్నారు. కొత్తగా తీసుకునే వారికి పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ ఫైౖ నాన్స్‌ ప్రకారం రుణాలను ఇస్తున్నారు.


మిగతా రైతులు మాత్రం రుణాల కోసం బ్యాంకులకు రావడం లేదు. ప్ర భుత్వం లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసినా ప్రస్తుతం చెల్లిస్తే రుణ మాఫీ వర్తించదని భావి స్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అక్టోబరు 2018 వరకు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణ మాఫీ వర్తిస్తుంది. రైతులు మాత్రం రుణాలు రీ షె డ్యూల్‌కు ముందుకు రావడం లేదు. జిల్లాలో రైతులం దరూ గడువులోపు రుణాలు రీ షెడ్యూల్‌ చేసుకుని కొ త్త రుణాలు తీసుకోవాలని  కలెక్టర్‌ కోరారు. రైతులంద రూ రుణాలు రెన్యూవల్‌ చేసుకుంటే వడ్డీ తక్కువ ప డుతుందన్నారు. కొత్త రుణాలు పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ ఫైౖ నాన్స్‌ ప్రకారం ఇస్తున్నారన్నారు. రుణాలు రీ షెడ్యూల్‌ చేసుకున్నా రుణ మాఫీ అవుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 25 వేల రూపాయల రుణాలు ఉన్న వారివి మాఫీ చేసిందన్నారు. ప్రతీరైతు ఈనెల చివరి వరకు రె న్యూవల్‌ చేసుకోవాలని కోరారు. గ్రామాల వారీగా ఈ నెల 15 నుంచి వ్యవసా య అధికారులు రీ షెడ్యూల్‌పై వివరిస్తారని తెలిపారు.

Updated Date - 2020-09-15T10:43:04+05:30 IST