నేడు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో డీల్‌

ABN , First Publish Date - 2021-04-23T10:25:54+05:30 IST

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకోనుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో డీల్‌

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకోనుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘రాబోయే మూడేళ్లలో 80 లక్షల ఇళ్లను డిజిటల్‌ పద్ధతుల్లో కనెక్ట్‌ చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొవిడ్‌ నేపథ్యంలో నాలుగేళ్ల కోర్సులను ఏడాదికి కుదించేందుకు ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఏడాది 1.30 కోట్లమందికి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ వంటి వసతులను సమకూర్చడానికి కసరత్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లా నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మైక్రోసా్‌ఫ్టతో జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొననున్నట్టు వెల్లడించారు.

Updated Date - 2021-04-23T10:25:54+05:30 IST