ఖానాపూర్, జనవరి 28 : మండల కేంద్రంలోని శ్రీవీరాంజనేయశివసాయిసమాజ్ ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయానికి హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యానందభారతీ స్వామీ హాజరై సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం సాయి సచ్ఛరిత్ర పారాయణం చేస్తున్న భక్తులకు విలువైన ప్రవచనాలను అందజేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో ఖానాపూర్ జూనియర్ సివిల్ జడ్జి రామలింగంతో పాటు పలువురు ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 3వ తేదినా నిర్వహించనున్న మహాఅన్నదానానికి బియ్యంతో పాటు వంట సామాగ్రిని పలువురు భక్తులు విరాళంగా అందజేశారు. చుట్టు పక్క గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.