ఈశ్వరయ్యను అప్పచెప్పకపోతే ఆమరణ దీక్ష

ABN , First Publish Date - 2021-02-28T05:09:15+05:30 IST

టీడీపీ అభ్యర్థి ఈశ్వరయ్యను ఆదివారంలోగా అప్పగిం చక పోతే సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు బద్వేలు మున్సిపాలిటీ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, బద్వేలు నియోజకవర్గ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ ప్రకటించారు.

ఈశ్వరయ్యను అప్పచెప్పకపోతే ఆమరణ దీక్ష
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

ఎన్నికల పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, బద్వేలు నేత రాజశేఖర్‌

బద్వేలు, ఫిబ్రవరి 27: టీడీపీ అభ్యర్థి ఈశ్వరయ్యను ఆదివారంలోగా అప్పగిం చక పోతే సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు బద్వేలు మున్సిపాలిటీ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, బద్వేలు నియోజకవర్గ  నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ ప్రకటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహిం చిన విలేకర్ల సమావేశంలో వారు మా ట్లాడుతూ

అధికార వైసీపీ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీలపట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారికి సరైన గుర్తింపు, ఉపాధి అవకాశం ఇవ్వలేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన 29వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి ఈశ్వరయ్య వారం నుంచీ కన్పించక పోవడంతో శుక్రవారం టీడీపీ నేతలతో కలిసి ఈశ్వరయ్య కుటుంబీకులు కేసు నమోదు చేయించారన్నారు. ఈశ్వరయ్య వరినాట్లకు వెళ్లాడని త్వరలో వస్తాడని తన కు ఫోన్‌ ద్వారా తెలియపరచినట్లు బద్వేలు సీఐ విలేకరులకు వెల్లడించారు.

దీంతో పోలీ సుల సహకారంతో ఈశ్వరయ్యను దాచిఉం టారని భావించిన రెడ్యం, రాజశేఖర్‌ ఈ మే రకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రంలోగా పోలీసులు ఈశ్వర య్యను అప్పచెప్పకపోతే  సోమవారం ఉదయం 5 గంటలనుంచి టీడీపీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చ రించారు.

వైసీపీ నేతలే ఈశ్వరయ్యను ఎక్కడో దాచి నాటకాలాడుతున్నారని, పోలీసులు సైతం వారికి మద్ధతు ఇస్తున్నారని తేటతెల్లం అవు తోందన్నారు.  టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షు డు కె.నరసింహానాయుడు, సీనియర్‌ నేతలు శ్రీనివాసనాయుడు, రామ్మూర్తినాయుడు, రామచంద్రారెడ్డి, కొలవలి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:09:15+05:30 IST