మృత్యు మ(పి)లుపు!

ABN , First Publish Date - 2022-05-28T06:56:09+05:30 IST

అతివేగం.. అవగాహన లోపం కమ్మర్‌పల్లి 64 వ జాతీయ రహదారిపై తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనం నడపడం వస్తే చాలు.. మిగితా నిబంధనలు గాలకి వదిలేసి ఇష్టానుసారంగా వెళుతూ తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పువాటిల్ల జేస్తున్నారు.

మృత్యు మ(పి)లుపు!
కమ్మర్‌పల్లి వద్ద గల 90 డిగ్రీల ప్రమాదకర మలుపు ఇదే..

జిల్లాలోని 64వ జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు 

మలుపుల వద్ద కానరాని సూచిక బోర్డులు

గాలిలో కలుస్తున్న నిండు ప్రాణాలు 

అతివేగం.. అవగాహన లోపమే ప్రధాన కారణం

కమ్మర్‌పల్లి పీఎస్‌ వద్ద 90 డిగ్రీల మలుపు

రోజుల వ్యవధిలోనే పలువురి దుర్మరణం

కమ్మర్‌పల్లి, మే 27: అతివేగం..  అవగాహన లోపం కమ్మర్‌పల్లి 64 వ జాతీయ రహదారిపై తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనం నడపడం వస్తే చాలు.. మిగితా నిబంధనలు గాలకి వదిలేసి ఇష్టానుసారంగా వెళుతూ తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పువాటిల్ల జేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సెలు లేకున్నా.. మోటారు వాహన చట్టాలపై కనీస అవగాహన లేకున్నా.. ఎవరికీ పట్టింపులేదు. తెలుసుకోవలన్నా ఉత్సుకత అంతకన్నా లేదు. అవగాహన కల్పించాలన్న శ్రద్ధ ఇటు అధికారులకూ  లేదు. వాహనాలు నడిపేవారికి సరైన అవగాహన లేకపోవడం వల్లే తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి రహదారి నెత్తురోడ్డుతుండగా..  నిండుప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు జరుతున్నా.. ఎవరూ  గుణపాఠం నేర్చుకోవడంలేదు. మద్యం తాగి వాహనాలు నడపరాదని నిబంధనలను ఎవరూ పట్టించుకోక వాహనాలు నడపడంతోనూ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంబధనలు తెలియక కొందరు, తెలిసినా పట్టించుకోక కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలకు గురై ఎన్నో కుంటుబాలు అయినవారిని కోల్పోయి రోడ్డున పడుతున్నాయి.

లైసెన్స్‌ లేకున్నా రోడ్డుపైకి..

కొందరు వాహనాలు నడపం నేర్చుకొని.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలు నడిపి ప్రమాదాలబారీన పడుతున్నారు. ఒక్కో వాహనంపై నలుగురేసి ప్రయాణం సాగిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ మధ్య కాలంలో యువత సెల్‌ఫోన్‌లు మాట్లాడుతు ప్రమాదాల బారీన పడుతున్నారు. కనీసం లైసెన్స్‌ లేకుండానే డ్రైంవిగ్‌ చేస్తున్న పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. వాహనం నడిపేవారికి జీబ్రా లైనింగ్‌లు, కల్వర్ట్‌, బ్రిడ్జీల వద్ద గుర్తులు తెలిసి ఉండాలి. అదేవిధంగా ప్రమాద మలుపుల వద్ద సూచిక బోర్డులును వాహనదారులు గమనించాలి.. స్పీడు తగ్గించాలి. కాని నిర్లక్ష్యం కారణంగా మలుపుల వద్ద ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలినడకన రహదారి దాటే ప్రతీ ప్రధాన కూడలి వద్ద జీబ్రాలైనిగ్స్‌ ఏర్పాట్లు చేసినప్పటికీ.. దాని గురించి కొందిరికి తెలువకపోగా.. తెలిసినవారు సైతం నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గ్రామాల్లో సైతం వాహనాల రద్దీ పెరిగింది.. దీంతో రోడు ్డదాటే ప్రయత్నంలో ముఖ్యంగా ప్రధాన రహదారుల పక్కన గల పాఠశాలల వద్ద విద్యార్థులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలు లేకపోలేదు. ఇంత జరుగుతన్నా వాహనదారులకు మోటారు వాహనచట్టంపై అవగాహన కల్పించుకోవాలని, అవగాహన కల్పించాలన్న ఆలోచనలు రాకపోవడం, వాహనదారులు ఇష్టానురీతిలో వాహనాలు నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. మోటారు వాహన చట్టంపై నేటి యువతకు సంపూర్ణ అవగాహన ఎంతైనా అవసరం. ఈ దిశన అధికారులు అడుగులు వేస్తే తప్ప.. ప్రమాదాల సంఖ్య తగ్గేట్లు కనిపించడంలేదు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపి ప్రమాదాలకు గురైతే.. వారికి వాహనాన్ని ఇచ్చిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదవుతాయని చట్టాలు చెబుతున్నా.. ఎవరికీ చెవికెక్కడం పోవడం విడ్డూరం. అలాంటి వారిని ఆపి మరీ కనీసం కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది.

కానరాని సూచిక బోర్డులు

జిల్లా సరిహద్దులోని కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ మండలాల పరిధిలో గల గండిహనుమాన్‌ వరకు కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే 64 వ జాతీయ రహదారి ఉంటుంది. ఈ రహదారిపై ఐదు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. మలుపుల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు లేవు. ఎవరు పట్టించుకునే వారు లేరని స్థానికులు, వాహనాదారులు ఆరోపిస్తున్నారు. కాగా స్థానిక పోలీస్టేషన్‌ వద్ద సుమారు 90 డిగ్రీల ప్రమాదకర మలుపు ఉంది. మలుపు వద్ద చెట్లు ఎత్తుగా పెరిగి ఎదురుగా వచ్చేవాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి చెట్లను తొలగిస్తే ప్రమాదాలను కొంతమేర నివారించవచ్చని స్థానికులు అంటున్నారు. ఇటీవల మలుపువద్ద ముగ్గురి ప్రాణాలు గాలిలో కలువగా.. అధిక స్పీడు కారణంగా కారుఢీకొని కమ్మర్‌పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. అయితే జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపే వాహనాలను నియంత్రించాలని, స్పీడ్‌ కంట్రోల్‌ నిమిత్తం స్టాప్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఆ దిశగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2022-05-28T06:56:09+05:30 IST