బెట్లా నేష‌న‌ల్ పార్కులో అనుమానాస్ప‌ద స్థితిలో ఏనుగు మృతి

ABN , First Publish Date - 2020-07-14T16:43:53+05:30 IST

జార్ఖండ్‌లోని బెట్లా నేషనల్ పార్క్‌లో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి చెందింది. ఈ వార్త తెలియగానే అటవీ శాఖ అధికారులు సంఘటనా....

బెట్లా నేష‌న‌ల్ పార్కులో అనుమానాస్ప‌ద స్థితిలో ఏనుగు మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని బెట్లా నేషనల్ పార్క్‌లో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి చెందింది. ఈ వార్త తెలియగానే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వ‌చ్చిన‌ తర్వాతే ఏనుగు మృతికి గ‌ల‌ ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం బెట్లా-మహువాండ్ ప్రధాన రహదారి వెంబడి గ‌ల అడవిలో ఈ ఏనుగు మృతిచెందిన స్థితిలో క‌నిపించింది. పెట్రోలింగ్‌లో ఉన్న అటవీశాఖ సిబ్బంది ఏనుగు మృతదేహాన్ని చూసి, అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక పులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 

Updated Date - 2020-07-14T16:43:53+05:30 IST