గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-10T06:09:39+05:30 IST

గాజువాక మార్కెట్‌ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది వుండడంతో స్థానికులు గాజువాక పోలీసులకు సమాచారం అందించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి మృతదేహం

గాజువాక, ఆగస్టు 9: గాజువాక మార్కెట్‌ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది వుండడంతో స్థానికులు గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడప్పుడు ఈ వ్యక్తి మార్కెట్‌లోకి పనికి వస్తాడని పోలీసులకు వారు తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు వుంటాయని, సంబంధితులు ఎవరైనా వుంటే తమను సంప్రతించాలని సీఐ మల్లేశ్వరరావు కోరారు.


Updated Date - 2022-08-10T06:09:39+05:30 IST